కోల్‌బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి, చెన్నూర్నియోజకవర్గాల్లో ‘కాకా వెంకటస్వామి కప్’ పేరిట నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ హోరాహోరీగా సాగుతోంది. గురువారం రామకృష్ణాపూర్ సింగరేణి ఠాగూర్ స్టేడియంలో రామకృష్ణాపూర్ క్రికెట్ క్లబ్, జైపూర్జాగ్వార్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో రామకృష్ణాపూర్క్రికెట్క్లబ్టీమ్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్చేసిన రామకృష్ణాపూర్టీమ్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది.
అనంతరం బ్యాటింగ్దిగిన జైపూర్జాగ్వార్స్ టీమ్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 126 పరుగులే చేసింది. 17 రన్స్‌తేడాతో ఆర్కేపీ క్లబ్ టీమ్ విజయం సాధించింది. అదే టీమ్ కు చెందిన బి.వి.రామారావు 50 రన్స్‌చేసి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. రెండో మ్యాచ్చెన్నూరు టైగర్స్, కోటపల్లి టైగర్స్టీమ్స్ మధ్య జరిగింది. మొదట బ్యాటింగ్చేసిన చెన్నూరు టీమ్ 5 వికెట్లు నష్టానికి 215 పరుగులు చేయగా, కోటపల్లి టీమ్ 18.3 ఓవర్లలో 120 పరుగులకే ఆలౌట్ అయింది. 95 పరుగుల తేడాతో చెన్నూరు టైగర్స్టీమ్భారీ విజయాన్ని అందుకుంది. 9 ఫోర్లతో 64 పరుగులు చేసిన సాయిచంద్ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
బెల్లంపల్లి ఏఎంసీ-–2 గ్రౌండ్లో జరిగిన మ్యాచ్‌లో కాసీపేట టీమ్9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్చేసిన కన్నెపల్లి టీమ్19 ఓవర్లలో కేవలం 68 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన కాసీపేట టీమ్కేవలం 7.1 ఓవర్లలో వికెట్నష్టానికి టార్గెట్‌ను చేజ్చేసింది. కేవలం ఎనిమిది పరుగులు ఇచ్చి, 3 వికెట్ల పడగొట్టిన అఖిల్.ఎం.జె ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. మరో మ్యాచ్‌లో తాండూర్ టీమ్భీమిని టీమ్ పై 95 పరుగులు తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన తాండూర్టీమ్20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి198 పరుగులు చేయగా, భీమిని టీమ్15.4 ఓవర్లలో 103 పరుగులకు ఆలౌట్ అయ్యింది.3 వికెట్లు తీయడంతోపాటు 22 పరుగులు చేసిన సాయి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కించుకున్నాడు.