ఘనంగా కాకా వెంకటస్వామి జయంతి వేడుకలు..

కరీంనగర్ జిల్లాలో మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి 94వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిగురుమామిడి పట్టణంలో జీవీఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాకా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

కార్యక్రమంలో భాగంగా ఫౌండేషన్ అధ్యక్షులు సదికుమార్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వెంకట స్వామి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు జీవీఎస్ ఫౌండేషన్ సభ్యులు.