రాజన్నసిరిసిల్ల, వెలుగు: తెలంగాణ ఎస్సీ కులాల సంఘం, కాకా అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకల కమలాకర్ ఆధ్వర్యంలో కాకా వెంకటస్వామి పేరిట రూపొందించిన క్యాలెండర్‌ను తంగళ్లపల్లి మండల కేంద్రంలో శనివారం మాలమహానాడు నాయకులు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాలమహానాడు నాయకులు మాట్లాడుతూ కేంద్రమంత్రిగా కాకా రాష్ట్ర ప్రజలకు ఎంతో సేవ చేశారన్నారు. ఏ ఒక్క పేదవాడు గూడు లేకుండా ఉండకూడదని, వారి పక్షాన పోరాటాలు చేశారన్నారు. కార్మికులకు పెన్షన్లు, హైదరాబాద్‌లో 75 వేల గృహాలను నిర్మించిన గొప్ప నాయకుడు కాకా అని కొనియాడారు.