కోల్‌బెల్ట్/ చెన్నూరు, వెలుగు: కేంద్ర మాజీ మంత్రి దివంగత కాకా వెంకటస్వామి స్మారక క్రికెట్ పోటీలను మందమర్రి మండలం సారంగపల్లిలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్విగ్రహ సాధన సమితి ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన పోటీలను మాజీ విప్, కాంగ్రెస్‌నేత నల్లాల ఓదెలు ప్రారంభించారు. పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులను పరిచయం చేసుకొని కొద్ది సేపు క్రికెట్ఆడి ఉత్సాహం నింపారు.
గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సాహించేందుకు చొరవచూపిన అంబేద్కర్ విగ్రహ సాధన సమితి నిర్వాహకులను అభినందించారు. 10 గ్రామపంచాయతీలకు చెందిన జట్లు పోటీల్లో పాల్గొంటున్నాయి. టోర్నమెంట్ నిర్వాహకులు శ్రీనివాస్, శివకుమార్, కిశోర్, కుమారస్వామి, కాంగ్రెస్ లీడర్లు కమల మనోహర్ రావు, చంద్రకళ, తిరుమల్ రెడ్డి, రాములు, రాయమల్లు, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.
చెన్నూర్‌లో..
చెన్నూరు పట్టణంలోని హైస్కూల్ గ్రౌండ్లో జరిగిన కాకా వెంకటస్వామి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్‌ను జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి కాకా చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ టోర్నమెంట్ జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు.
నేటి యూవత కాకా వెంకటస్వామిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని కోరారు. టోర్నమెంట్ ఐదు రోజులపాటు కొనసాగుతుందని, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నేతలు పాతర్ల నాగరాజు, సుశీల్ కుమార్, చింతల శ్రీనివాస్, శ్రీధర్, రవి, బాప గౌడ్, అన్వర్, సూర్యనారాయణ, వెంకటేశ్, సుధాకర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.