మంచిర్యాల, లక్సెట్టిపేట టీమ్స్​ గెలుపు

మంచిర్యాల, లక్సెట్టిపేట టీమ్స్​ గెలుపు

కోల్బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ సింగరేణి ఠాగూర్ స్టేడియంలో నిర్వహిస్తున్న ‘కాకా వెంకటస్వామి’ స్మారక మంచిర్యాల నియోజకవర్గస్థాయి క్రికెట్ టోర్నీలో క్రీడాకారుల జోరు కొనసాగుతోంది. గురువారం మంచిర్యాల రాయల్స్, హాజీపూర్ టైగర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్​లో ప్లేయర్లు పరుగుల మోత మోగించారు. మొదట బ్యాటింగ్ చేసిన హాజీపూర్ టైగర్స్ టీమ్​ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 రన్స్ చేసింది. కృష్ణ 42 బాంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సులతో 83 రన్స్ చేశాడు. అనంతరం బ్యాటింగ్​కు దిగిన మంచిర్యాల టీమ్​ 18.5 ఓవర్లలో వికెట్ నష్టపోయి 9 వికెట్ల తేడాతో గ్రాండ్​ విక్టరీ సాధించింది. కాజీమ్ 62 బాల్స్ 9 ఫోర్లు, 2 సిక్స్ తో 93 రన్స్ చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. ప్రదీప్ 33 బాల్స్​లో 10 ఫోర్లతో 50 రన్స్ చేశాడు. 

సెకండ్​ మ్యాచ్​లో.. 

లక్సెట్టిపేట హీరోస్, దండేపెల్లి లయన్స్  జట్ల మధ్య మధ్యాహ్నం జరిగిన మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేసిన లక్సెట్టిపేట టీమ్​ నిర్ణీత 16 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 135 రన్స్ చేసింది. అనంతరం బ్యాటింగ్ దిగిన దండేపల్లి టీమ్​ 14 ఓవర్లలో 100 రన్స్ కే ఆలౌట్ అయింది. 30 బాల్స్ లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 51 రన్స్ చేసిన లక్సెట్టిపేట జట్టు క్రీడాకారుడు రమేశ్​కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.