ఆర్కేపీ క్రికెట్ క్లబ్ గ్రాండ్ విక్టరీ.. కాకా క్రికెట్ టోర్నీ

ఆర్కేపీ క్రికెట్ క్లబ్ గ్రాండ్ విక్టరీ.. కాకా క్రికెట్ టోర్నీ
  •    సెంచరీతో అదరగొట్టిన ప్రేమ్​చంద్
  •     మరో మ్యాచ్​లో నెన్నెలపై తాండూర్​ విజయం​
  •     పోటాపోటీగా కాకా వెంకటస్వామి స్మారక క్రికెట్​ టోర్నమెంట్​

కోల్​బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్​సింగరేణి ఠాగూర్​స్టేడియంలో జరుగుతున్న కాకా వెంకటస్వామి స్మారక క్రికెట్​ పోటీల్లో రామకృష్ణాపూర్​క్రికెట్​క్లబ్(ఆర్కేపీ) ​గ్రాండ్​విక్టరీ సాధించింది. శనివారం కోటపల్లి టైగర్స్ జట్టుపై 104 రన్స్​తేడాతో గెలిచింది. మొదట ఆర్కేపీ జట్టు బ్యాటింగ్​చేయగా ప్రేమ్​చంద్ 52 బాల్స్​లో 13 ఫోర్లు, 7 సిక్స్​లతో 118 రన్స్​చేసి అదరగొట్టాడు. తోడుగా సుశాంత్​23 బాల్స్​లో 3 ఫోర్లు, 3 సిక్స్​లతో 52 రన్స్​చేసి ప్రత్యర్థి బౌలర్లను బెంబేలెత్తించాడు. ఈ ఇద్దరూ కలిసి 170 రన్స్​ జోడించారు.

కోట సతీశ్​36, బీవీ రామారావు 34  కూడా రాణించడంతో రామకృష్ణాపూర్​క్రికెట్​క్లబ్​జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 265 పరుగుల భారీ స్కోర్​చేసింది. తర్వాత బ్యాటింగ్ కు​దిగిన కోటపల్లి జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 161 రన్స్ మాత్రమే చేయగలిగింది. మింటు 37, సాయి కింగ్​టాకూర్​32 పరుగులు సాధించారు. ఆర్కేపీ జట్టులో 118 రన్స్ చేసిన ప్రేమ్​చంద్​ ప్లేయర్​ఆఫ్​ది మ్యాచ్ గా నిలిచాడు. మధ్యాహ్నం జరిగిన పోటీల్లో భీమారం టీం జైపూర్ ​జట్టుపై 29 రన్స్​ తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్​ చేసిన భీమారం 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 రన్స్​చేసింది. రంజిత్​ 48 బాల్స్​లో 10 ఫోర్లు, 3 సిక్స్​లతో 79 రన్స్​, వీరేందర్​20 పరుగులు చేశారు. తర్వాత బ్యాటింగ్​కు దిగిన జైపూర్​నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 146 రన్స్​మాత్రమే చేయగలిగింది. 79 రన్స్​చేసిన భీమారం జట్టు ప్లేయర్​రంజిత్​ ప్లేయర్​ ఆఫ్​ ది మ్యాచ్​గా నిలిచాడు.

బెల్లంపల్లి పోటీల్లో తాండూర్​ జట్టు విక్టరీ

బెల్లంపల్లిలోని ఏఎంసీ-2 గ్రౌండ్​లో నెన్నెల, తాండూర్​ జట్ల మధ్య జరిగిన మ్యాచ్​లో 5 వికెట్ల తేడాతో తాండూర్​ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్​చేసిన నెన్నెల ప్లేయర్లు 17.3 ఓవర్లలో 106 రన్స్​చేసి అలౌట్ అయ్యారు. అనంతరం బ్యాటింగ్ చేసిన తాండూర్​జట్టు 16.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసి విజయం సాధించింది. 23 రన్స్ చేయడంతో పాటు3  వికెట్లు​తీసిన తాండూర్​ప్లేయర్​ప్రమోద్​ ప్లేయర్​ఆఫ్​ ది మ్యాచ్ గా నిలిచాడు.