
హైదరాబాద్: నగరంలో కాకా వెంకటస్వామి 94వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు దళిత సంఘాలు, ప్రజా సంఘాల నేతలు. ట్యాంక్ బండ్ పై కాకా విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్, పలువురు నేతలు. ఈ సంరద్భంగా పేదల కోసం కాకా వెంకటస్వామి చేసి సేవలను స్మరించుకున్నారు దళిత సంఘాలు, ప్రజా సంఘాల నేతలు.