కాకా యాదిలో.. వర్ధంతి సందర్భంగా పలువురు ప్రముఖులు, దళిత నేతల నివాళి

కాకా యాదిలో.. వర్ధంతి సందర్భంగా పలువురు ప్రముఖులు, దళిత నేతల నివాళి

కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి 10వ వర్ధంతి సందర్భంగా ఆదివారం హైదరాబాద్ ట్యాంక్​బండ్​ వద్ద ఆయన విగ్రహానికి పలువురు ప్రముఖులు, దళిత సంఘాల నేతలు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కాకా సేవలను కొనియాడారు. తెలంగాణ ఏర్పాటులో కాకా కీలక పాత్ర పోషించారని, సోనియాగాంధీని ఒప్పించారని తెలిపారు. హైదరాబాద్​లో ఇండ్లు లేని వేల మందికి గుడిసెలు వేయించారని గుర్తు చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, అంబేద్కర్ విద్యాసంస్థల కరస్పాండెంట్ సరోజా వివేక్, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, మాజీ మంత్రి శంకర్ రావు తదితరులు కాకా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

వర్ధంతి సందర్భంగా పలువురు ప్రముఖులు, దళిత నేతల నివాళి  

హైదరాబాద్, వెలుగు: కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి 10వ వర్ధంతి సందర్భంగా ఆదివారం హైదరాబాద్ ట్యాంక్ బండ్ లోని ఆయన విగ్రహానికి పలువురు ప్రముఖులు, దళిత సంఘాల నేతలు నివాళి అర్పించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్, కాకా కుమారుడు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, అంబేద్కర్ విద్యాసంస్థల కరస్పాండెంట్ సరోజా వివేక్, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, మాజీ మంత్రి శంకర్ రావు తదితరులు కాకా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాకా సేవలను కొనియాడారు. తెలంగాణ ఏర్పాటులో కాకా కీలక పాత్ర పోషించారని, సోనియాగాంధీని ఒప్పించారని తెలిపారు. హైదరాబాద్ లో ఇండ్లు లేని వేల మందికి గుడిసెలు వేయించారని గుర్తు చేశారు. 

కాకా ఆశయాల సాధనకు కృషి చేస్తా: ఎంపీ వంశీకృష్ణ 

కాకా ఆశయాల సాధనకు కృషి చేస్తానని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. బడుగు బలహీన వర్గాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ‘‘ఇండ్లు లేని పేదలకు కాకా గుడిసెలు వేయించారు. 75 వేల మందికి పట్టాలు ఇప్పించారు. ప్రైవేట్ రంగంలో తొలిసారి పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చారు. సివిల్ సప్లై మంత్రిగా ఉన్నప్పుడు రేషన్ స్కీమ్ తెచ్చారు” అని గుర్తు చేశారు.  ‘‘అంబేద్కర్ ను, దళితులను కేంద్ర హోం మంత్రి అమిత్ షా అవమానించారు. ఇప్పుడు కాకా ఉండి ఉంటే ఈ ఘటనపై భారీ ర్యాలీ, ధర్నా చేసేవారు. 

అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా ఇటీవల పార్లమెంట్​లో ర్యాలీ తీశాం” అని ఆయన  చెప్పారు. కాగా, పలువురు దళిత సంఘాల నేతలు ఎంపీ వంశీకృష్ణను కలిసి తమ సమస్యలను విన్నవించారు. పేదల కోసం నిరంతరం తపించిన వ్యక్తి కాకా వెంకటస్వామి అని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య కొనియాడారు. ఆయన ఆశయాల సాధనకు కృషి చేస్తామని వెల్లడించారు.