బెంగళూరులో బయటపడ్డ రేవ్ పార్టీ ఉదంతం ఏపీలో కలకలం రేపింది. ఈ పార్టీలో వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి స్టిక్కర్ ఉన్న కారు దొరకడం సంచలనంగా మారింది. ఈ కేసుపై కర్ణాటక పోలీసుల దర్యాప్తు కొనసాగుతుండగా ఏపీలో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. రేవ్ పార్టీ కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలోనే జరిగిందని, కాకాని పాస్ పోర్ట్ కూడా దొరికిందని టీడీపీ సీనియర్ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాకాని గోవర్ధన్ రెడ్డి స్పందించాడు.
బ్లడ్ శాంపిల్స్ ఇచ్చేందుకు సిద్ధం కావాలని సోమిరెడ్డికి సవాల్ విసిరారు కాకాని. తన పాస్ పోర్ట్ తన వద్దనే ఉందని, కారులో దొరికిన పాస్ పోర్ట్ సోమిరెడ్డి దగ్గర ఉందా, కర్ణాటక పోలీసుల దగ్గర ఉందో చెప్పాలని అన్నారు. క్లబ్ కు వెళ్ళటం, పేకాట ఆడటం, డ్రగ్స్ అలవాటు ఎవరికి ఉన్నాయో తేల్చుకుందామని దమ్ముంటే సోమిరెడ్డి రావాలని అన్నారు.
ALSO READ | లోకేష్ కు పార్టీ పగ్గాలు ఇవ్వాలి..బుద్ధా వెంకన్న డిమాండ్..
సోమిరెడ్డి క్యారెక్టర్ పై అప్పట్లో పత్రికల్లో కధనాలు వచ్చాయని, వాటిని సోమిరెడ్డి ఖండించను కూడా లేదని అన్నారు. సోమిరెడ్డి చీకటి కోణాలు చాలా ఉన్నాయని అన్నారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా వ్యక్తిగత ఆరోపణలు చేయటం సరికాదని అన్నారు. కోర్టులో దొంగతనంపై తనకు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిందని, ఏ విచారణకైనా సిద్దమని అన్నారు కాకాని.