గోదావరిఖనిలో కాకా వర్థంతి వేడుకలు

గోదావరిఖనిలో  కాకా వర్థంతి వేడుకలు

 కాంగ్రెస్ సీనియర్ నేత.. కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి 10 వ  వర్థంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లా రామగుండంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు.  గోదావరిఖని లక్ష్మినగర్ లో దినసరి కూలీలకు  లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మల్లికార్జున్ అల్పాహారాన్ని పంపిణీ చేశారు.  కాకా  బడుగు బలహీన వర్గాల తో పాటు,కార్మిక వర్గానికి  చేసిన సేవలను లయన్స్ ప్రతినిధులు  కొనియాడారు.