కాకతీయ వర్సిటీ పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా

వరంగల్ అర్బన్ :  రేపటి నుంచి (ఈ నెల 8 వ తేది)  జరగాల్సిన  కాకతీయ విశ్వవిద్యాలయ పోస్టు గ్రాడ్యుయేషన్ రెండవ సంవత్సర రెండవ సెమిస్టర్  (ఎం.ఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ) పరీక్షలు వాయిదా పడ్డాయి. కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేసినట్లు  రిజిస్ట్రార్ ప్రొఫెసర్  కె.పురుషోత్తం, పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఎస్ మహేందర్ రెడ్డి ఒక  ప్రకటనలో తెలియజేశారు. వాయిదా వేసిన పరీక్షలు తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే ప్రకటిస్తామన్నారు. అన్ని వివరాలు ఎప్పటికప్పుడు విశ్వవిద్యాలయ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు.