
పర్వతగిరి(గీసుగొండ, సంగెం), వెలుగు: వరంగల్జిల్లా గీసుగొండ, సంగెం మండలాల పరిధిలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, కలెక్టర్ సత్య శారద బుధవారం సందర్శించారు. గణేశ్ ఏకోటెక్ కంపెనీలో పనులను పరిశీలించి, కంపెనీ నిర్వాహకులతో మాట్లాడారు.
అంతకుముందు గీసుగొండ మండల కేంద్రంలో సన్న బియ్యం లబ్ధిదారుడు దౌడు సంపత్ రాజకుమారి ఇంట్లో కలెక్టర్, ఇతర ఆఫీసర్లతో కలిసి భోజనం చేశారు. అనంతరం లబ్ధిదారులను ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి శాలువాతో సన్మానించారు.