కాకతీయ యూనివర్సిటీ అసిస్టెంట్​ రిజిస్ట్రార్పై సస్పెన్షన్​ వేటు

కాకతీయ యూనివర్సిటీ  అసిస్టెంట్​ రిజిస్ట్రార్పై  సస్పెన్షన్​ వేటు

భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న  కాకతీయ యూనివర్సిటీ  అసిస్టెంట్​ రిజిస్ట్రార్​ పెండ్లి అశోక్​ బాబుపై సస్పెన్షన్​  వేటు పడింది. ఈ మేరకు వర్శిటీ రిజిస్ట్రార్ ఫ్రొఫెసర్ మల్లారెడ్డి  ఉత్తర్వులు జారీ చేశారు.

అశోక్ బాబు  వర్శిటీ భూములు ఆక్రమించుకుని  ఇల్లు కట్టుకున్నారనే ఆరోపణలున్నాయి.  ఈ ఆరోపణలపై  ఫిజికల్​ సర్వే నిర్వహించారు విజిలెన్స్​, రెవెన్యూ, కేయూ అధికారులు. కుమార్​ పల్లి శివారులో కేయూకు చెందిన సర్వే నెంబర్​ 229లోనే అశోక్​ బాబు ఇల్లు ఉందని నిర్ధారించారు. అయితే తాను యూనివర్సిటీ బయట సర్వే నెంబర్​ 235 లో ఇల్లు కట్టుకున్నానంటూ  అశోక్​ బాబు బుకాయించారు. కానీ విజిలెన్స్​ సర్వేలో ఆక్రమించుకుని కట్టారని తేలింది.

Also Read :- కేటీఆర్..దమ్ముంటే బహిరంగంగా మాట్లాడు

విజిలెన్స్​, రెవెన్యూ ఆఫీసర్లు చేసిన సర్వేను తప్పుపడుతూ ఇటీవల సోషల్​ మీడియాలో పోస్టులు పెట్టారు అశోక్​ బాబు.  వర్సిటీ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాడన్న కారణంతో ఐదు రోజుల కిందట రిజిస్ట్రార్  మెమో జారీ చేశారు. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.  అశోక్​ బాబు వివరణపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఇన్​ఛార్జ్​ వీసీ వాకాటి కరుణ  సస్పెండ్​ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో  అశోక్​ బాబును సస్పెండ్ చేస్తూ  వర్శిటీ రిజిస్ట్రార్ ​ ఉత్తర్వులు జారీ  చేశారు.