కేయూ విద్యార్థి సంఘాల పేరుతో.. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో వెలిసిన పోస్టర్ల కలకలం సృష్టిస్తున్నాయి. ఇంచార్జ్ రిజిస్ట్రార్ గా కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్ మెంట్ విభాగం ప్రొఫెసర్ శ్రీనివాస్ రావుకు బాధ్యతలు అప్పగించడంపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. కేయూ మెయిన్ గేట్లు, కాలేజీ, హాస్టల్ గోడలపై ఆయన నియమాకాన్ని నిరసిస్తూ పోస్టర్లు వెలిశాయి.
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మళ్లీ ఆంధ్రా పెత్తనం ఏంటంటూ పోస్టర్లు ఏర్పాటు చేశారు. శ్రీనివాస్ రావుది ఆంధ్రా ప్రాంతమని, తెలంగాణకు చెందిన ప్రొఫెసర్లు లేరా అంటూ విద్యార్థి సంఘాల పేరుతో పోస్టర్లు వెలిశాయి. 2 నెలల్లో పదవీ విరమణ చేయబోయే ప్రొఫెసర్ కు ఎలా రిజిస్ట్రార్ ఇస్తారని పోస్టర్లలో విద్యార్థి సంఘాలు ప్రశ్నించారు. వీసీ తన నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.