ఏప్రిల్‍లో సోషియాలజీ ఇంటర్నేషనల్‍ మీట్‍ నిర్వహిస్తాం

  •     కాకతీయ యూనివర్సిటీ వీసీ తాటికొండ రమేశ్
  •     ప్రారంభమైన కేయూ మహిళా ఇంజినీరింగ్‍ కాలేజీ ఫెస్ట్​

హసన్‍పర్తి(కేయూసీ), వెలుగు : సమాజ అవసరాలకు ఉపయోగపడేలా ఇంజినీరింగ్‍ స్టూడెంట్ల ఆవిష్కరణలు ఉండాలని కేయూ వీసీ తాటికొండ రమేశ్‍ అన్నారు. బుధవారం కేయూ ఆడిటోరియంలో మహిళా ఇంజినీరింగ్‍ కాలేజీ ప్రిన్సిపల్‍ ప్రొఫెసర్‍ ఎం.సదానందం అధ్యక్షతన రెండు రోజుల రూబీ జెస్ట్‍ –2024 (టెక్నికల్‍ ఫెస్ట్‍)ను వీసీ ప్రారంభించారు. ఈ సందర్భంగా రమేశ్‍ మాట్లాడుతూ.. విద్యార్థులు ఆత్మవిశ్వాసంలో ముందుకుసాగాలన్నారు. కేవలం క్లాస్‍ రూం, ల్యాబ్‍లకే పరిమితం కాకుండా సమాజాన్ని అధ్యయనం చేయాలన్నారు.  

కేయూలో 30 ఏండ్ల తర్వాత ఇండియన్‍ హిస్టరీ కాంగ్రెస్‍ నిర్వహించామని,  ఏప్రిల్‍ నెలలో సోషియాలజీ ఇంటర్నేషనల్‍ సదస్సు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రిజిస్ట్రార్‍ మల్లారెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులకు కాలేజీలో కావాల్సిన ఫెసిలిటీస్‍ అందుబాటులో ఉన్నాయన్నారు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. ప్రిన్సిపల్‍ సదానందం మాట్లాడుతూ..రాష్ట్రంలో ఏకైన యూనివర్సిటీ మహిళా ఇంజినీరింగ్‍ కాలేజీ కేవలం కేయూలో ఉందన్నారు. 95 శాతం క్యాంపస్‍ ఇంటర్వ్యూలో జాబ్స్‍ సంపాదిస్తున్నట్లు వెల్లడించారు.