మాదాపూర్ సీసీఆర్టీలో ముగిసిన కళా ఉత్సవ్

మాదాపూర్ సీసీఆర్టీలో ముగిసిన కళా ఉత్సవ్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ స్టేట్ స్కూల్​ఎడ్యుకేషన్, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నిర్వహించిన ‘కళా ఉత్సవ్–2024’ ముగిసింది. మాదాపూర్ సీసీఆర్టీలో రెండురోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో రాష్ట్రంలోని33 జిల్లాల నుంచి స్టూడెంట్స్​ ఉత్సాహంగా పాల్గొన్నారు. శనివారం మ్యూజిక్, స్టోరీ టెల్లింగ్, థియేటర్ ఆర్ట్స్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఈ మూడు విభాగాల్లో 178 మంది విద్యార్థులు పాల్గొన్నారు.