కేరళ, తమిళనాడుకు కల్లక్కడల్‌ ముప్పు.. తీరంలో అలల ఉగ్రరూపం

కేరళ, తమిళనాడు రాష్ట్రాలను కల్లక్కడల్ వణికిస్తోంది. రెండు రాష్ట్రాల తీరాలకు కల్లక్కడల్ ముప్పు పొంచి ఉందని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ హెచ్చరించింది. జనవరి 14న రాత్రి అకస్మాత్తుగా సముద్రంలో వచ్చే ఉప్పెన కారణంగా బలమైన అలలు ఎగసిపడే అవకాశం ఉందని ఐఎన్‌సీవోఐఎస్ తెలిపింది. 

ఐఎన్‌సీవోఐఎస్ హెచ్చరించినట్లుగానే.. తీరంలో ఇప్పుడిప్పుడే ఉవ్వెత్తున అలలు ఎగసిపడుతున్నాయి. తీరంలో ఈ అలలు మరింత ఉధృతంగా ఎగసిపడే అవకాశం ఉందని ఐఎన్‌సీవోఐఎస్ అంచనా వేసింది.  ఐఎన్‌సీవోఐఎస్ హెచ్చరికల నేపథ్యంలో  కేరళ, తమిళనాడు రాష్ట్రాల విపత్తు నిర్వహణ సంస్థలు అలర్ట్ అయ్యాయి. తీర ప్రాంతాలపై అదనపు నిఘా ఉంచాయి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు. 

ALSO READ | ఇక చాలు.. మా వాళ్లను త్వరగా తిరిగి పంపండి: రష్యాకు భారత్ డిమాండ్

కల్లక్కడల్ ముప్పు నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలను రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం చేశాయి. అలలు ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉందని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించాయి. అలాగే.. పర్యాటకలు ఎవరూ బీచ్‎కు రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. అలాగే మత్య్సకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు అధికారులు. 

కలక్కడల్ అంటే..?

సముద్రపు అలలు ఆకస్మాత్తుగా దూసుకురావడాన్ని ‘కలక్కడల్’ అంటారు. కల్లక్కడల్ అనే పదం రెండు మలయాళ పదాల కలయిక. కేరళ మత్య్సకారులు ఉపయోగించే భాష ప్రకారం..  ‘కల్లన్’ అంటే దొంగ, ‘కడల్’ అంటే సముద్రం. రెండు పదాలు కలిపి కల్లక్కడల్ అంటే సముద్రపు దొంగ అంటారు. దొంగలాగా ఒక్కసారి వేగంగా దూసుకొచ్చే అలలను ‘కలక్కడల్’ అంటారు. ఈ కడక్కకల్ ఎలాంటి హెచ్చరికలు లేకుండా అకస్మాత్తుగా సంభవిస్తుంది.