![వేములవాడకు చేరుకున్న కలాం స్ఫూర్తి బస్సు యాత్ర](https://static.v6velugu.com/uploads/2025/02/kalam-spurthi-bus-yatra-reaches-vemulawada_Wb7QRxVPpm.jpg)
వేములవాడ, వెలుగు: విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించడమే లక్ష్యంగా చేపట్టిన కలాం స్ఫూర్తి యాత్ర బస్సు సోమవారం వేములవాడకు చేరుకుంది. పట్టణంలోని ప్రభుత్వ స్కూల్‌లో బస్సు యాత్రను డీఎస్‌వో దేవయ్య, హెచ్‌ఎం రాజారత్నం ప్రారంభించారు.
విద్యార్థులు బస్సులోని సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన పరికరాలు, ల్యాబ్‌లను పరిశీలించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీ వినియోగం పెరుగుతోందని, విద్యార్థులకు టెక్నాలజీపై అవగాహన పెంచేందుకే ఈ బస్సు యాత్ర నిర్వహిస్తున్నారన్నారు.