మేడ్చల్ లో కళాయాత్ర ప్రారంభం

మేడ్చల్, కలెక్టరేట్ వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలు 2024 కళాయాత్ర కార్యక్రమాన్ని మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ ఆఫీసు వద్ద మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్లు రాధిక గుప్తా, విజయేందర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అదనపు కలెక్టర్ విజయేందర్ మాట్లాడుతూ..   ప్రజాపాలనపై కళాయాత్ర ద్వారా ఊరూరా తిరుగుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై ప్రచారం చేస్తామని తెలిపారు. ఈ కళాయాత్ర జిల్లాలోని 114 లోకేషన్లలో  ప్రచారం నిర్వహిస్తామన్నారు.  ప్రోగ్రాంలో  డీపీఆర్‌‌‌‌ఓ స్వర్ణలత, డీఆర్డీఓ సాంబశివరావు, కళాయాత్ర టీమ్ హెడ్ బాలు, అర్జున్ రావ్, అధికారులు పాల్గొన్నారు.  అనంతరం ప్రభుత్వ సంక్షేమ పథకాలపై కళాకారులు పాటలు పాడారు.