జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వర ముక్తీశ్వర స్వామి క్షేత్రంలో మూడు రోజుల పాటు జరిగే మహశివరాత్రి ఉత్సవాలకు ఆలయం ముస్తాబైంది. మహారాష్ట్ర , చత్తీస్ ఘడ్ నుంచి అధికంగా భక్తులు కాళేశ్వరం రానున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును, ఆలయ ఈవో మారుతి అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.
7 న ఉదయం 10 గంటల కు దీపారాధన తో కార్యక్రమాలు మొదలవుతాయి. 8 న శివరాత్రి రోజు కల్యాణం, రాత్రి 12 గంటలకు మహాభిషేకం , లింగోద్బవపూజ కార్యక్రమాలుంటాయి. మూడవ రోజు శనివారం మహన్యాస పూర్వక రుద్రాభిషేకం అనంతరం పవళింపు సేవతో ఉత్సవాలు ముగుస్తాయి. – మహదేవపూర్,వెలుగు