మూణ్నెళ్ల ఎత్తిపోయడానికి ఇంత ఖర్చా?

మూణ్నెళ్ల ఎత్తిపోయడానికి ఇంత ఖర్చా?

హైదరాబాద్: మూడు నెలల వరద నీరు ఎత్తిపోయడానికి ఇంత ఖర్చు అవసరమా..? అని కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించారు. ఇవాళ జలసౌధలో కాళేశ్వరంపై ఆయన పలువురు ఇంజినీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను కమిషన్ ప్రశ్నించింది. గోదావరిలో నీళ్లుండగా ప్రాణహిత  నుంచి ఎత్తిపోయాల్సిన అవసరం ఏమొచ్చిందని అడిగింది. ప్రాణహిత–చేవెళ్ల నిర్మాణంపై ఐదుగురు సభ్యుల కమిటీ ఇచ్చిన నివేదికను తమకు అందించాలని సూచించింది. రిటైర్డ్ ఇంజినీర్లు ఇచ్చిన రిపోర్ట్ ను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించారు. 

 27న అఫిడవిట్లు!

కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలపై విచారణకు హాజరైన వారి నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ అఫిడవిట్లు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నివేదికలు 27న అందనున్నాయి. ఇప్పటికే ఇంజినీర్లు, పలు నిర్మాణ సంస్థలకు సంబంధించి ప్రతినిధులను కమిషన్ ప్రశ్నించింది. వచ్చే నెల 7న ఎన్డీఎస్ఏ, సీడబ్ల్యూపీఆర్, సీఎస్ఎంఆర్ఎస్ నివేదికలు కమిషన్ కు అందనున్నాయి. ప్రధానంగా ఆర్థిక అంశాలపైనే దృష్టి సారించిన కమిషన్ ప్రతి అంశాన్నీ ప్రశ్నిస్తోంది. వాళ్లు ఇచ్చే వివరణను అఫిడవిట్ల రూపంలో తీసుకోనుంది