హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం జ్యుడీషియల్కమిషన్తదుపరి దశ ఓపెన్కోర్టు విచారణను సోమవారం నుంచి ప్రారంభించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన లోయర్ కేడర్ఇంజినీర్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది. ఏఈఈ, డీఈఈలు 52 మందిని విచారించనుంది. ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్లో వాళ్లదే కీలకపాత్ర ఉంటుందని భావిస్తున్న కమిషన్.. వారి నుంచి కూడా వివరాలను రాబట్టాలని నిర్ణయించింది.
అయితే, ఎక్కువ మంది ఉండడంతో రోజూ14 మంది చొప్పున విచారించనుంది. వారి విచారణ పూర్తికాగానే ఐఏఎస్ అధికారులకూ సమన్లు ఇచ్చే అవకాశం ఉంది. అనంతరం కాంట్రాక్టర్లు, సబ్కాంట్రాక్టర్లను విచారణకు పిలవనున్నట్టు తెలుస్తున్నది.