స్పెషల్ CS రామకృష్ణారావుపై ప్రశ్నల వర్షం.. లోన్లు, డిజైన్లు, బడ్జెట్ చూట్టే క్వశ్చన్స్..!

స్పెషల్ CS  రామకృష్ణారావుపై ప్రశ్నల వర్షం.. లోన్లు, డిజైన్లు, బడ్జెట్ చూట్టే క్వశ్చన్స్..!

24 ప్రశ్నలు!

= స్పెషల్ సీఎస్ రామకృష్ణారావును ప్రశ్నించిన కాళేశ్వరం కమిషన్

= లోన్లు, డిజైన్లు, బడ్జెట్ చూట్టే క్వశ్చన్స్
= రేపు అన్నారం బ్యారేజీ కట్టిన నవయుగ కంపెనీ విచారణ
= ఎల్లుండి విచారణకు  మేడిగడ్డ నిర్మించిన ఎల్ అండ్ టీ
= తర్వాత సుందిళ్ల నిర్మించిన ఆఫ్కాన్స్ కంపెనీకి పిలుపు 

హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ విచారణ వేగంగా సాగుతోంది. ఈ నెలాఖరు లోగా పూర్తి నివేదిక సిద్ధం చేయడమే లక్ష్యంగా కమిషన్ ముందుకు సాగుతోంది. ఇవాళ గత ప్రభుత్వంలో ఫైనాన్స్ స్పెషల్ సెక్రటరీ గా పనిచేసిన రామకృష్ణారావు కమిషన్ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్బంగా కమిషన్ కాళేశ్వరం ప్యాకేజీలకు సంబంధించిన డిజైన్లు, కమిషన్ పేరిట తీసుకున్న అప్పులు, బడ్జెట్ తదితర అంశాలపై ఆయనను ప్రశ్నించింది. కార్పొరేషన్‎కు నిధులు ఎలా సమకూర్చారని అడిగింది.

 రెవెన్యూ ఎలా జనరేట్ చేయాలనుకున్నారని, తీసుకున్న అప్పులు ఎలా చెల్లిస్తామని భావించారంటూ ప్రశ్నించింది. డిజైన్ల విషయంలో నిబంధనలు పాటించారా..? డిజైన్లకు ఎవరి బాధ్యత వహించాలన్న ప్రశ్నకు అంతా ప్రభుత్వానిదేనంటూ రామకృష్ణారావు సమాధానం ఇచ్చినట్టు సమాచారం. ప్రాజెక్టును తొందరగా కట్టినా నిబంధనలు పాటించలేదని కమిషన్ పేర్కొంది. రెవెన్యూ ఎలా జనరేట్ చేస్తారన్న ప్రశ్నకు పరిశ్రమలకు నీళ్లు అమ్మి తద్వారా వచ్చిన ఆదాయంతో చెల్లించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. ప్రాజెక్టుకు సంబంధించిన ఫైల్స్ ప్రాపర్‎గా క్యాబినెట్ ముందుకు రాలేదని కమిషన్ తెలిపింది. 

ALSO READ | కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశంలో కీలక అంశాలు ఇవే

నిబంధనలు పాటించని అంశాల రికార్డులను ఈ సందర్బంగా కమిషన్ రామకృష్ణారావుకు చూపించింది. మొత్తం 24 ప్రశ్నలను సంధించి సమాధానాలు రాబట్టింది కమిషన్. ఇదిలా ఉండగా రేపు అన్నారం బ్యారేజీ  నిర్మించిన నవయుగ కంపెనీ ప్రతినిధులను విచారణకు పిలిచారు. ఈ  సంస్థకు  సంబంధించిన ముగ్గురిని కమిషన్ విచారించనుంది. ఎల్లుండి మేడిగడ్డ బ్యారేజీ నిర్మించిన ఎల్అండ్ కంపెనీ ప్రతినిధులను విచారించనుంది. మరుసటి రోజు సుందిళ్ల బ్యారేజీ కట్టిన ఆఫ్కాన్స్ కంపెనీ ప్రతినిధులను విచారణకు పిలవాలని భావిస్తోంది.

కమిషన్                                                                                           స్పెషల్ సీఎస్
డిజైన్లలో నిబంధనలపైనా ప్రశ్నలు                                       ఆ బాధ్యత సర్కారుదే
రెవెన్యూ ఎలా జనరేట్ చేస్తారు                                                పరిశ్రమలకు నీళ్లు అమ్మి చేయాలనుకున్నం
కార్పొరేషన్ కు నిధులెలా సమకూర్చారు                                ప్రభుత్వం గ్యారెంటీ తోనే లోన్స్ వచ్చాయి
ఆర్థిక పరమైన రికార్డులను మైంటైన్ చేయలే                        ప్రాజెక్టుపై కోర్ కమిటీ రికార్డులు లేవు
తీసుకున్న అప్పునకు ఏటా ఎంత కడ్తున్నరు                         ప్రిన్సిపల్ అమౌంట్ తో కలిపి రూ. 7300 కోట్లు            
వడ్డీ ఎంత చెల్లిస్తున్నారు                                                            9నుంచి 10.5 శాతం వడ్డీతో రీ పేమెంట్ చేస్తున్నాం