27 నుంచి కాళేశ్వరం కమిషన్ ఓపెన్ కోర్టు

27 నుంచి కాళేశ్వరం కమిషన్  ఓపెన్ కోర్టు

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ విచారణ తుది దశకు చేరింది. ఈ దఫా ఓపెన్ కోర్టును ఈ నెల 27 నుంచి నిర్వహించనుంది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) అధికారులతో పాటు ఇప్పటికే విచారణకు హాజరైన ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులను కమిషన్ పిలవనున్నట్టు తెలిసింది. కమిషన్ ఇప్పటివరకు 109 మందిని విచారించింది.

 వారితో పాటు పలువురు ప్రజాప్రతినిధులనూ విచారణకు పిలుస్తారంటూ చర్చ జరిగింది. అయితే, వారిని విచారణకు పిలిచే యోచనలో కమిషన్ లేనట్టు తెలిసింది. ఇప్పటికే కమిషన్ తన విచారణ రిపోర్టును దాదాపు పూర్తి చేసినట్టు తెలిసింది. మొత్తం 400 పేజీలతో నివేదికను రాసినట్టు సమాచారం. ఆ రిపోర్టుకు తుదిమెరుగులును దిద్దుతున్నారని చెబుతున్నారు. కమిషన్ ఏప్రిల్‌‌ లోపు తుది నివేదికను సమర్పించనున్నట్టు తెలుస్తున్నది.