కాళేశ్వరం ENC హరిరామ్ కు 14 రోజుల రిమాండ్..చంచల్ గూడ జైలుకు తరలింపు

కాళేశ్వరం ENC హరిరామ్ కు 14 రోజుల రిమాండ్..చంచల్ గూడ జైలుకు తరలింపు

అక్రమాస్తుల విషయంలో కాళేశ్వరం ENC హరిరామ్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసింది ఏసీబీ.  ఏప్రిల్ 26న అర్థరాత్రి జడ్జి ముందు ప్రవేశ పెట్టగా..   14 రోజుల రిమాండ్ విధించారు . ఇవాళ హరిరామ్ ను చంచల్ గూడ జైలుకు తరలించారు అధికారులు. 

కాళేశ్వరం ENC హరి రామ్, అతని బంధువుల ఇండ్లల్లో ఏప్రిల్ 26న 13 చోట్ల ఒకేసారి ఏసీబీ సోదాలు నిర్వహించింది. హరిరామ్ కు దాదాపు రూ. 200 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది.

 సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో భారీగా చట్టవిరుద్ధమైన ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు ఏసీబీ అధికారులు.  షేక్ పేటలో విల్లా, కొండపూర్ లో  విల్లాలు, నార్సింగి, మాదాపూర్ ఫ్లాట్స్ ,  ఏపీ అమరావతిలో వాణిజ్య స్థలం, మార్కుక్ మండలంలో 28ఎకరాల వ్యవసాయ భూమి, పటాన్ చెరులో 20 గుంటలు, శ్రీనగర్ కాలనీలో రెండు ఇండిపెండెంట్ ఇండ్లు, 6 ఎకరాల మామిడి తోట, ఒక ఫామ్ హౌస్, కొత్తగూడెం కుత్బుల్లాపూర్ మిర్యాలగూడలో ఓపెన్ ప్లాట్లు,  బీఎండబ్ల్యూ కార్ తో సహా బంగారు ఆభరణాలు, పలు ఆస్తుల పాత్రలు, బ్యాంకు డిపాజిట్లు ఉన్నట్లు గుర్తించింది ఏసీబీ.