రామగుండం మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్లపై కాళేశ్వరం కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ సందర్భంగా ఓరల్ సమాధానాలు చెబితే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది. వేరే వాళ్లు చేసిన తప్పులను మీ భుజాలపై వేసుకోవద్దని సూచించింది కమిషన్. మూడు బ్యారేజీలపై స్పష్టమైన సమాధానాలు చెప్పాలని సూచించింది.
మొదటి కట్టిన కాఫర్ డ్యాం వరదలో మునిగిపోవడంతో ఎత్తు పెంచాల్సి వచ్చిందని కమిషన్ కు చెప్పారు వెంకటేశ్వర్వు. బ్యారేజీలు పూర్తయ్యే నాటికి అంచనా వ్యయం పెరిగిందని కమిషన్ కు చెప్పారు వెంకటేశ్వర్లు.
బ్యారేజీలకు ఒరిజినల్ ఎస్టిమేషన్ ప్రారంభంలో మేడిగడ్డ రూ, 2591 కోట్లు, అన్నారం 1785 కోట్లు, సుందిళ్ల 1437 కోట్లు అని చెప్పారు. మూడు బ్యారేజీలు పూర్తి అయ్యేసరికి మేడిగడ్డ 4613 కోట్లు, అన్నారం 2700 కోట్లు, సుందిళ్ల 2200 కోట్లకు పెరిగినట్లు చెప్పారు వెంకటేశ్వర్లు.
ALSO READ | కాళేశ్వరం ఆలోచన కేసీఆర్దే !
ఒరిజినల్ ఎస్టిమేషన్ కు పూర్తయ్యేనాటి కాస్ట్ కి డబుల్ ఖర్చు ఎందుకు అయ్యిందని కమిషన్ ప్రశ్నించింది. అయితే నిర్మాణ సంస్థలు ప్రారంభంలో ప్రాజెక్ట్ లెంత్ విడ్త్ ఒకలా.. మధ్యలో మార్పుల వల్ల కాస్ట్ పెరిగిందని చెప్పారు వెంకటేశ్వర్లు. కాళేశ్వరం కంటే ముందు ప్రాణహిత చేవెళ్లకు 14 వేల కోట్లు ఖర్చు చేస్తే 750 కోట్లు వేస్ట్ అయ్యాయని కమిషన్ ముందు చెప్పారు వెంకటేశ్వర్లు. డిజైన్స్ డ్రాయింగ్ ఆలస్యం, అదనపు పనుల వల్ల కాస్ట్ పెరిగినట్లు కమిషన్ కు తెలిపిన వెంకటేశ్వర్లు.
2019 నుంచే బ్యారేజీల దగ్గర సమస్యలున్నాయని కమిషన్ కు చెప్పారు వెంకటేశ్వర్లు. మళ్లీ అక్టోబర్ 28న విచారణకు హాజరకావాలని కమిషన్ ఆదేశించింది. వెంకటేశ్వర్లను అక్టోబర్ 24న కూడా కాళేశ్వరం కమిషన్ విచారించింది. బ్యారేజీల డీపీఆర్, నీటి నిల్వ గురించి ప్రశ్నించింది.