తుది దశకు కాళేశ్వరం కమిషన్ విచారణ.. ఈ వారంలో విచారణకు హరీశ్.!

తుది దశకు కాళేశ్వరం కమిషన్ విచారణ.. ఈ వారంలో విచారణకు  హరీశ్.!

కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ తుది దశకు చేరుకుంది. కోల్  కతా నుంచి  హైదరాబాద్ కు చేరుకున్నారు జస్టిస్ పీసీ ఘోష్. BRS హయాంలో ఆర్థిక, నీటి పారుదలశాఖ మంత్రులుగా పనిచేసిన ఈటల  , హరీశ్ రావులను ఈ వారంలో విచారణకు పిలిచే అవకాశం ఉంది. దీనిపై వారికి నోటీసులు ఇచ్చేందుకు కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. నిధుల కేటాయింపు, ఉత్తర్వుల జారీ, పలు సంస్థల నుంచి రుణాల సేకరణ వంటి అంశాలపై గతంలో జరిగిన విచారణలో నమోదు చేసింది కమిషన్.

నిర్మాణాలు, సర్వేలకు మంత్రి మండలి నిర్ణయాలు లేకుండానే జరిగిన చెల్లింపుల విషయంలో ఆర్థిక శాఖ పాత్ర ఏమిటనే కోణంలో జస్టిస్ పీసీ ఘోష్  విచారించారు. ఇప్పుడు ఆయా అంశాలకు సంబంధించి ప్రభుత్వ స్థాయిలో ఏం జరిగింది.. నాడు ఆర్థిక మంత్రిగా ఉన్న రాజేందర్ ను ప్రశ్నించే అవకాశాలున్నట్లు తెలిసింది. బ్యారేజీల నిర్మాణాల విషయంలో తీసుకున్న నిర్ణయాలపై అప్పటి మంత్రి హరీశ్ రావును కమిషన్ ప్రశ్నిస్తుందని సమాచారం. ఇక  వచ్చే నెలలో ప్రభుత్వానికి ఒక ప్రాథమిక నివేదిక అందించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.