
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం జ్యుడీషియల్కమిషన్గడువును సర్కారు మరో రెండు నెలల పాటు పొడిగించింది. ఫిబ్రవరి 28తో ప్రస్తుతం ఉన్న గడువు ముగుస్తుండడం.. విచారణ పూర్తి కాకపోవడంతో ప్రభుత్వం కమిషన్గడువును మరోసారి పొడిగించింది. ఏప్రిల్ 30 వరకు జ్యుడీషియల్కమిషన్.. తన రిపోర్టును సమర్పించాలని పేర్కొంది.
కాగా, ఈ పొడిగింపుతో ఐదోసారి కమిషన్గడువును పొడిగించినట్టయింది. కాళేశ్వరం జ్యుడీషియల్కమిషన్చైర్మన్జస్టిస్ పినాకి చంద్రఘోశ్ ఈ నెల 23న రాష్ట్రానికి రానున్నారు. 24 నుంచి మరో దఫా ఓపెన్కోర్టును నిర్వహించనున్నారు.