అక్టోబర్ 22 నుంచి కాళేశ్వరం ఓపెన్ కోర్టు ప్రారంభం

అక్టోబర్ 22 నుంచి కాళేశ్వరం ఓపెన్ కోర్టు ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం జ్యుడీషియల్ కమి షన్ ఓపెన్ కోర్టు మంగళవారం నుంచి మళ్లీ ప్రారంభం కానున్నది. సోమవారం రాత్రి కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ హైదరాబాద్​కు రానున్నారు. అనంతరం ఆయన విచారణకు పిలవాల్సిన అధికారుల జాబితాను తయారు చేసి అధికారులకు ఇస్తారని తెలిసింది. మంగళవారం నుంచి ఓపెన్ కోర్టును మళ్లీ షురూ చేయనున్న కమిషన్.. పోయినసారి ఆపిన దగ్గర్నుంచే ఈ దఫా ప్రారంభించాలని నిర్ణయించినట్టు సమాచారం.

రిటైర్డ్ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లుతోనే విచారణ పున:ప్రారంభిస్తారని అధికార వర్గాలు చెప్తున్నాయి. గత నెల 28న రిటైర్డ్ ఈఎన్​సీ వెంకటేశ్వర్లును కమిషన్ సుదీర్ఘంగా విచారించింది. ఆయన నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు మరోసారి ఎంక్వైరీ చేయనున్నది. ఈసారి విచారణలో భాగంగా మాజీ సీఎస్, ఇరిగేషన్ శాఖకు అప్పట్లో సెక్రటరీలుగా పనిచేసిన ఐఏఎస్​లు, ఆర్థిక శాఖ కార్యదర్శులను ఓపెన్ కోర్టుకు పిలవొచ్చని తెలుస్తోంది.