పెద్దపల్లి రైతుల పంటలు మళ్లా  మునిగినయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

పెద్దపల్లి  రైతుల పంటలు మళ్లా  మునిగినయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • నాలుగేండ్లుగా కాళేశ్వరం బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మునక
  • బ్యారేజీలు ఓపెన్​చేసి ఉన్నా స్థానిక ప్రవాహాలతోనూ ముంపే 
  • ముంపు భూములను సర్కార్​ తీసుకోవాలని రైతుల వేడుకోలు 
  • నాలుగేళ్లుగా నష్టపోతున్నామంటున్న రైతులు

పెద్దపల్లి, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మరోసారి రైతుల పొలాలను ముంచింది. కాళేశ్వరంలో భాగంగా అన్నారం, సుందిళ్ల బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఏటా పెద్దపల్లి జిల్లాలోని వేల ఎకరాలు నీటమునుగుతున్నాయి. నాలుగేళ్లుగా ఇదే విధంగా పంటలు మునిగినా నాటి బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రైతుల గోడును పట్టించుకోలేదు. వారం రోజులుగా పడుతున్న వర్షాలతో గోదావరిలో ప్రవాహం పెరిగింది. దీంతో అన్నారం బ్యారేజీ కింద  ఉన్న ఆరెంద, మల్లారం గ్రామాల పరిధిలోని దాదాపు 400 ఎకరాల పంటలు మరోసారి నీటమునిగాయి. ఏటా ఇలాగే నష్టపోతున్నామని, ముంపు భూములను ప్రభుత్వం తీసుకొని తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. 

 

  • బ్యారేజీలు ఓపెన్​ ఉన్నా తప్పని ముంపు 

గతంలో బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పంటలు మునిగేవి. కానీ ఇటీవల బ్యారేజీలు డ్యామేజ్​ కావడంతో గేట్లు తీసి నీరు కిందకు వదులుతున్నారు. అయినప్పటికీ ఆరెంద, మల్లారం గ్రామాలకు చెందిన పొలాలు మునిగాయి. అన్నారం బ్యారేజీకి నిర్మించిన కరకట్ట వల్ల క్యాచ్​మెంట్​ ఏరియా నుంచి వచ్చే ప్రవాహాలు పంట పొలాల్లోకి చేరుతున్నాయి. ప్రాజెక్టులో భాగంగా బ్యారేజీల బ్యాక్​వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ముంపునకు గురవుతున్న వేల ఎకరాల భూమిని తీసుకోవడానికి గత సర్కార్​ సర్వే చేసింది. కానీ రేటు విషయంలో రైతులకు అన్యాయం చేసేలా అధికారులు రిపోర్టులు తయారు చేశారనే ఆరోపణలు వచ్చాయి. ముంపు భూములకు రూ. 6 నుంచి రూ. 7 లక్షల వరకే చెల్లించే అవకాశం ఉందని నాటి అధికారులు చెప్పడంతో  రైతులు  అంగీకరించలేదు.  ముంపు భూములకు మార్కెట్​ రేటు ఇవ్వాలని రైతులు డిమాండ్​ చేస్తున్నారు.

  • నాలుగేళ్లుగా 8 పంటలకు పరిహారం ఇయ్యాలే

నాలుగేళ్లుగా సాలుకు రెండు పంటల చొప్పున 8 పంటలు వేసినా  రైతుల చేతికి గింజ కూడా దక్కలేదు. ప్రతీ పంట నీటి పాలైంది. మొదటి ఏడాది పంట మునిగిన తర్వాత అధికారులు వచ్చి నష్టాన్ని లెక్కించి ఎకరానికి రూ. 19వేలు ఇచ్చారు. ఆ తర్వాత నష్టపోయిన పంటలకు రూపాయి కూడా ఇవ్వలేదు. క్రాప్ హాలీడే కింద పరిహారం ఇస్తామని నాటి సర్కార్​ చెప్పినా అది ఆచరణలోకి రాలేదు. ప్రాజెక్టు నిర్మాణం కాక ముందు రూ. 2 లక్షలతో బోర్లు వేయించుకొని ఏటా రెండు పంటలు పండించే వాళ్లమని, నీటి తాకిడికి బోర్లు, పైపు లైన్లు  కూడా మునిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన రైతులకు నాటి సర్కార్​ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సబ్సిడీ కూడా ఇవ్వలేదని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్​రెడ్డి బ్యారేజీల ముంపుతో నష్టపోతున్న రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.

  • మా భూములు తీసుకోవాలి 

ముంపుకు గురవుతున్న మా భూములను సర్కార్​ తీసుకుంటేనే రైతులకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. బ్యాక్​ వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు కాలువల్లో పారే నీళ్లు కూడా పంటలను ముంచుతున్నయి. సర్కార్​ భూములను తీసుకోకపోతే అవి దేనికీ పనికి రావు, ఇప్పటికైనా సర్కార్​ ఓ నిర్ణయం తీసుకోవాలే.

- సుంకరి బాపు, మల్లారం,   పెద్దపల్లి 

  • మార్కెట్​ రేటు ఇచ్చి భూములు తీసుకోవాలే

మార్కెట్​ రేటు ఇచ్చి ప్రభుత్వం ముంపు భూములను తీసుకోవాలే.  నాలుగేళ్లుగా పంటలు వేసి నష్టపోతున్నాం. కాళేశ్వరం నిర్మాణంలో అధికారులు చేసిన తప్పుకు మేము బలవుతున్నాం. పంటలు వేసినా ఏటా మునుగుతూనే ఉన్నాయి. అప్పుల పాలైనం. భూములు తీసుకొని ప్రభుత్వం మాకు న్యాయం చేయాలే.
-  ఒడితెల సతీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మల్లారం, పెద్దపల్లి