బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పార్టీకీ ఏటీఎంగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టు : డా. గంగిడి మనోహర్‌‌‌‌రెడ్డి

తమది రైతు ప్రభుత్వమంటూ ప్రచారం చేస్తూ  రైతు అజెండాతో జాతీయ స్థాయి రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్టు కేసీఆర్​ ఇటీవల బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు అంకురార్పణ చేశారు. కేసీఆర్‌‌‌‌ అన్నదాతలను ఎంత మోసం చేశారో. కేసీఆర్‌‌‌‌ పాలనలో రైతు కన్నీరు పెడితే ముఖ్యమంత్రి ఫామ్‌‌‌‌ హౌస్‌‌‌‌లో మాత్రం పన్నీరుగా ఉంది.

రైతుబందు వడ్డీలకే..

రైతులకు లక్ష రూపాయల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని 2018 ఎన్నికల్లో ప్రకటించారు. ఆచరణలో మాత్రం ప్రభుత్వం హామీని తుంగలో తొక్కింది. రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు 5.66 లక్షల మంది రైతులకే లబ్ది చేకూరుస్తూ రూ.37 వేలలోపు రుణాలనే మాఫీ చేశారు. రైతుబంధు పేరుతో ఎకరాకు 5 వేల రూపాయిలిచ్చి వ్యవసాయానికి మేలు చేస్తున్నామని చెప్పుకుంటున్నారు. కానీ, రుణమాఫీ చేయకుండా కేవలం రైతుబంధు ఇస్తే.. అది వడ్డీలకే సరిపోతున్నది. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వం లక్ష రూపాయిల రుణ మాఫీ చేయకపోవడం వల్ల మొత్తం రైతుల రుణాలు పేరుకుపోయాయి. దాంతో రాష్ట్రంలో దాదాపు 16 లక్షల మంది రైతుల ఖాతాల్ని ఎన్‌‌‌‌.పి.ఏలుగా ప్రకటించారు. వాటికి చక్రవడ్డీ కలిపి ఈ ఐదేండ్లలో వడ్డీనే లక్ష రూపాయిలకు చేరింది.  కాబట్టి, ఒకవేళ ఎన్నికల ముందు రైతులకు రుణ మాఫీ చేసినా, వడ్డీ రూపంలో ఇంకా లక్ష రూపాయిలు మిగిలే ఉంటుంది. ఇప్పటికే,  రైతులు పంట అమ్ముకున్న డబ్బు ఖాతాలో పడగానే బ్యాంకర్లు వడ్డీ కట్‌‌‌‌ చేసుకోవడంతో పాటు ఖాతాలు స్తంభింపజేసి రైతుల నుంచి బలవంతంగా రుణాల్ని వసూలు చేస్తున్నారు. ఇక, మొత్తం 55 లక్షల మంది రైతుల్లో 30 లక్షల మంది రైతులకు బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందడం లేదు. రైతు పక్షపాతి అని చెప్పుకుంటున్న బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పార్టీ నిజ స్వరూపం ఇది. 

‘పల్లా’ డొల్ల మాటలు

 రైతులకు 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తున్నామని మీడియా ముందు చాటింపు వేసుకోవడంలో బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నాయకులు ముందుంటారు. కానీ, గత రెండేళ్లుగా రైతులకు ఎనిమిది గంటలకు మించి కరెంటు ఇస్తున్నది లేదు. రైతులకు ఉచిత ఎరువులు అందిస్తామని జబ్బలు చరుచుకున్న కేసీఆర్‌‌‌‌ ఎరువుల ధరలను పెంచి, సబ్సిడీలు ఎత్తేసి రైతుల నడ్డి విరుస్తున్నారు. గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ నిధులతో కట్టిన రైతు వేదికలను కూడా నిర్వీర్యం చేశారు. రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌‌‌‌ రెడ్డి రైతు సంక్షేమం గురించి తప్ప అన్నీ మాట్లాడతారు. రైతులనే ఉరికిస్తామని మాట్లాడటం ఆయనకే చెల్లింది. పల్లా మాటల్లో డొల్లతనం తప్ప నిజాయితీ లేదు.

సమస్యల సృష్టికర్త

పోడు భూ వివాదాలను వెంటనే పరిష్కరించి, యాజమాన్య హక్కులు కల్పిస్తామని చెప్పిన కేసీఆర్‌‌‌‌, ఇప్పుడు పోడు భూముల గొడవలు లేవనెత్తి, అమాయక గిరిజనుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నిమిషాల్లో భూముల రిజిస్ట్రేషన్‌‌‌‌ పూర్తవుతుందని ప్రకటించిన ధరణి, భూ కుంభకోణానికి దారులు వేసింది. భూమే ప్రాణంగా బతికే రైతు తన భూమి హక్కు కోసం నెలల తరబడి అధికారుల చుట్టూ తిరిగే దుస్థితి తీసుకొచ్చింది. 

పోయిన రబీ సీజన్‌‌‌‌  లో ‘వరి వేస్తే ఉరి’ అని రైతాంగాన్ని భయపెట్టిన కేసీఆర్‌‌‌‌.. ఇటు రైతులు వరి పండించకుండా, అటు భూసార పరీక్షలు చేయించకుండా వారికి తీరని నష్టం చేశారు. రైతు చేతులకే బేడీలు వేసిన చరిత్ర కలిగిన బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నుంచి ఇంతకు మించి ఆశించేదుముంటుంది? క్యాప్సికమ్‌‌‌‌, అల్లం పండిస్తే లాభాలు వస్తాయని ఉత్త మాటలు చెప్పిన ఫాంహౌస్​ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌‌‌, వాటిని ఎలా సాగు చేయాలో మాత్రం చెప్పలేదు. అందరూ సన్న వడ్లు పండించాలని చెప్పి, తన ఫాంహౌస్​ లో దానికి విరుద్ధంగా దొడ్డు వడ్లు పండించి దగా చేశారు. రైతు కంట కన్నీరు పెట్టిస్తూ, తన ఫాంహౌస్ లో మాత్రం నదీ జలాలతో పన్నీరు చల్లుకుంటున్నారు. ఇది రైతు ప్రభుత్వం కాదు, , దళారీలకు అండగా నిలబడే ప్రభుత్వం.

మాస్టర్​ ప్లాన్ల బాగోతం బయటపెట్టాం

కేసీఆర్‌‌‌‌ ప్రభుత్వం తన పార్టీ ప్రజాప్రతినిధులకు లాభం చేకూర్చేలా మాస్టర్‌‌‌‌ ప్లాన్‌‌‌‌ పేరుతో రైతుల భూములను దౌర్జన్యంగా స్వాధీనం చేసుకుంటున్నారు. దీనిపై కామారెడ్డి, జగిత్యాలలో  రైతులు రోడ్డెక్కారు. రైతులకు మద్దతుగా బీజేపీ నేతలు ఆందోళనకు  జంకిన కేసీఆర్‌‌‌‌ ప్రభుత్వంతన నిర్ణయాన్ని వెనుక్కు తీసుకుంది . బీజేపీ సాధించిన విజయమది. కేంద్రం వ్యవసాయరంగానికి అందిస్తున్న సబ్సిడీలను, పథకాలను మాయచేసి, కేసీఆర్​ ప్రభుత్వం సొంత ప్రచారాని కి అలవాటు పడ్డది. వ్యవసాయ రంగానికి కేంద్రం అందిస్తున్న ప్రతి సహకారాన్ని కేసీఆర్​సర్కారు  సద్వినియోగం చేయగలిగితే  రైతు రాజుగా మారుతాడు.

కమీషన్ల ధ్యాస తప్ప నీటివాటా పట్టదు

కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పార్టీకీ ఏటీఎంగా మారింది. కాళేశ్వరం పేరు చెప్పి వేల కోట్లు కమీషన్లు తిన్నారు. కొద్దిపాటి వానలకే మునిగిపోయిన కాళేశ్వరం మోటర్లను పరిశీలించడానికి బీజేపీ నాయకులకు అనుమతి ఇవ్వకుండా, తమ తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. కాళేశ్వరం వచ్చినా.. ఉమ్మడి రాష్ట్రంలో కంటే ఒక్క చుక్క కూడా ఎక్కువ సాగునీరు పారలేదు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్‌‌‌‌,  ఈ తొమ్మిదేళ్లలో కనీసం ఒక్క నియోజకవర్గంలో కూడా లక్ష ఎకరాలకు సాగునీరు అందించలేకపోయారు. కృష్ణానదీ జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి 575 టీఎంసీల నీటి వాటా రావాల్సి ఉండగా, 299 టీఎంసీల నీటి వాటాకే ఒప్పుకుని కేసీఆర్‌‌‌‌ తెలంగాణ రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారు. ఫలితంగా ఇప్పటికీ ఉమ్మడి నల్లగొండ, పాలమూరు జిల్లాల్లో సాగునీటి సమస్య తీరలేదు.

 - డా. గంగిడి మనోహర్‌‌‌‌రెడ్డి,
ప్రముఖ్‌‌‌‌,  ప్రజాసంగ్రామయాత్ర