కల్వకుంట్ల ఖజానా నింపేందుకే కాళేశ్వరం : పాల్వాయి హరీశ్

కల్వకుంట్ల ఖజానా నింపేందుకే కాళేశ్వరం : పాల్వాయి హరీశ్
  • బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టును కల్వకుంట్ల కుటుంబం ఖజానా నింపేందుకే కట్టారు తప్ప ఆ ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రజలకు ఏమాత్రం ఉపయోగంలేదని, ఈ విషయాన్ని తాము మొదటి నుంచి చెబుతున్నామని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

 తాము చేసిన ఆరోపణలు నిజమని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) నివేదిక స్పష్టం చేసిందని చెప్పారు.ఈ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు, అవినీతి, అక్రమాలపై కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రభుత్వానికి తాము ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. అందుకే నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ విచారణ జరిపి ఈ ప్రాజెక్టులోని లోపాలను ఎత్తిచూపిందని వివరించారు.