మూడేండ్లు కట్టిండ్రు.. మూడేండ్లకే కూలింది : కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

మూడేండ్లు కట్టిండ్రు.. మూడేండ్లకే కూలింది : కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి
  • కాళేశ్వరానికి చీఫ్ ఇంజనీర్, డిజైనర్, కాంట్రాక్టర్ నేనే అన్న కేసీఆర్: కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

హైదరాబాద్, వెలుగు: ప్రపంచంలో 8వ వింత, తన మానస పుత్రిక అని కేసీఆర్ చెప్పుకున్న కాళేశ్వరంలోని మేడిగడ్డ మూడేండ్లకే కూలిందని ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ఎద్దేవా చేశారు. శనివారం హెచ్ఐసీసీలో భారత్ సమ్మిట్ లో వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడారు. మేడిగడ్డతో పాటు, అన్నారం, సుందిళ్ల కూడా ఉండవని ఎన్ డీఎస్ఏ రిపోర్ట్ లో పేర్కొందన్నారు. 

అక్కడ నీళ్లు నిలిపి ఉంటే ఇప్పటికే ఆ మూడు బ్యారేజీలు కొట్టుకుపోయేవన్నారు. వాటి నిర్మాణంలో నాణ్యత లోపం ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు చీఫ్ ఇంజనీర్, డిజైనర్, కాంట్రాక్టర్.. మొత్తం కేసీఆరే అని, ఆయన తన మానస పుత్రికని అని చెప్పేవారని అన్నారు. ప్రపంచంలో 8వ వింత అని ఆ పార్టీ నేతలు చెప్పేవారని.. మూడేండ్లలో కట్టడం, కూలిపోవడం రెండు జరిగాయని, అదే నిజమయిందని ఎద్దేవా చేశారు.