కాళేశ్వరం ప్రాజెక్టును ప్రణాళిక ప్రకారం నిర్మించలేదు

  • కాళేశ్వరం ప్లాన్​ ప్రకారం కట్టలే: సీఎల్పీ నేత భట్టి 
  • అందుకే రైతులకు ఉపయోగపడట్లే: సీఎల్పీ నేత భట్టి 


న్యూఢిల్లీ, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టును ప్లాన్ ప్రకారం కట్టలేదని, అందుకే అది రైతులకు ఉపయోగపడడం లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఏ ప్రాజెక్టు నైనా ఇంజినీర్లు డిజైన్​ చేస్తారని, కానీ కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్​ స్వయంగా డిజైన్​ చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడిం దన్నారు. ఇప్పుడు సీతారామ సాగర్ ప్రాజెక్ట్ ను కూడా ఇష్టం వచ్చినట్టు కడుతున్నారని ఫైరయ్యారు. ఢిల్లీలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 

రాష్ట్రం రూ.5 లక్షల కోట్ల అప్పులో చిక్కుకుపోయిందని, కనీసం వరద సాయం చేసే స్థితిలో కూడా లేదన్నారు. విపత్తు టైంలో ప్రజా ప్రతి నిధులు, అధికారులు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోయారన్నారు. ఇతర పార్టీల్లో స్వేచ్ఛ, అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోవడం వల్లే నాయకులు కాంగ్రెస్​లో చేరుతున్నారన్నారు. విజయావకాశాలను అంచనా వేసిన తర్వాతే అధిష్టానం అభ్యర్థులను ఖరారు చేస్తుందన్నారు.