కాళేశ్వరం టెంపుల్ ఈవో పై బదిలీ వేటు

కాళేశ్వరం టెంపుల్ ఈవో పై బదిలీ వేటు

మహదేవపూర్, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం టెంపుల్ ఇన్​చార్జి ఈవో మారుతి పై వేటు పడింది. గర్భగుడిలో సింగర్​ మధు ప్రియ పాట షూటింగ్ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చలకు తావివ్వగా దేవాదాయ శాఖ ఈవోను బదిలీ చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. సింగర్ మధు ప్రియ జనవరి 20 న టెంపుల్ లో షూటింగ్ కోసం ఫోన్​లో ఇన్​చార్జి ఈవో మారుతి అనుమతి తీసుకుంది. 

అదేరోజు ఆయనతో పాటు ఆలయ సిబ్బంది, అర్చకులు  కాళేశ్వరంలో కార్యక్రమానికి ఆహ్వానించేందుకు శృంగేరి పీఠానికి వెళ్లారు. గర్భగుడిలో షూటింగ్​ చేయడంపై  భక్తులు, ప్రజా సంఘాలు , వివిధ రాజకీయ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నాలు చేశారు. దీంతో ఈవోను ఇన్​చార్జి బాధ్యతల నుంచి తొలగిస్తూ దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ జ్యోతి ఉత్తర్వులు జారీ చేశారు.