తెలంగాణ రాష్ట్రం మొత్తం అన్ని రంగాల్లో వాడే కరెంట్ కంటే ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టే ఎక్కువ కరెంట్ వాడుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న పంపులు రోజు నడిస్తే 203 మిలియన్స్ యూనిట్ల కరెంట్ అవసరం పడుతుందని ప్రస్తుతం తెలంగాణలో ఉన్న అన్ని రంగాలు వాడుతున్న కరెంట్ 196 మిలియన్ యూనిట్స్ మాత్రమే అని చెప్పారు. అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం కన్జూమ్ చేసే కరెంట్ కన్న కాళేశ్వరం వాడే కరెంట్ ఎక్కువ అని చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అన్ని పంపులు నడిచినస్తే వచ్చే కరెంట్ బిల్లు ప్రతి ఏటా రూ.10 వేల 374 కోట్లు ఉంటుందని తెలిపారు. ప్రాజెక్టు డీపీఆర్ ఇవ్వకముందే 25 వేల కోట్లు కాంట్రక్టులకు టెండర్లు పిలిచారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అతిపెద్ద రిజర్వాయర్ మలన్న సాగర్ అని కానీ అది చిన్నపాటి భూకంపం వచ్చిన కొట్టుకపోతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.