గోదావరిఖని, వెలుగు: రాష్ట్ర స్థాయి పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ పోటీల్లో పాల్గొనే క్రీడాకారుల ఎంపిక కోసం కాళేశ్వరం జోన్ స్థాయి ఆటల పోటీలు ఆదివారం గోదావరిఖని నెహ్రూ స్టేడియంలో జరిగాయి. ఈ పోటీలను అడిషనల్ డీసీపీ(అడ్మిన్) సి.రాజు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని కాళేశ్వరం జోన్కు అధిక మెడల్స్సాధించాలని కోరారు. కాగా ఈ పోటీలు రామగుండం పోలీస్ కమిషనరేట్, కుమురంభీమ్ ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల పోలీస్ టీంలు పాల్గొన్నాయి. షటిల్ బ్యాడ్మింటన్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బాస్కెట్ బాల్, హ్యాండ్ బాల్, స్విమ్మింగ్, టగ్ ఆఫ్ వార్, హై జంప్, లాంగ్ జంప్, షాట్ పుట్, డిస్కస్ త్రో, జావలిన్, అథ్లెటిక్స్ అంశాల్లో పోటీలు జరిగాయి.