ఎన్ఐటీ వరంగల్ సిఫార్సుతో సీకెంట్ ఫైల్స్

  •     సుందిళ్ల బ్యారేజీలో 6 వెంట్లు డిజైన్స్​లో తరువాత చేర్చాం: సీడీవో ఎస్ఈ ఫజల్​

హైదరాబాద్, వెలుగు : ఎన్ఐటీ వరంగల్ సిఫార్సుల మేరకు మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో సీకెంట్ ఫైల్స్​కు వెళ్లాలని కాళేశ్వరం సీఈ చెప్పారని.. అందుకు అనుగుణంగానే చేసినట్లు సీడీవో ఎస్ఈ ఫజల్ పీసీ ఘోష్ ​కమిషన్​కు తెలిపారు.శుక్రవారం కాళేశ్వరంపై వేసిన కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్​ ఓపెన్ కోర్టులో ఫజల్​ను క్రాస్ ఎగ్జామిన్ చేశారు.

 ఈ సందర్భం గా సీకెంట్ ఫైల్స్, డిజైన్స్​పై కొన్ని ప్రశ్నలు అడి గారు. వాటికి ఎస్ఈ ఫజల్​ సమాధానం ఇచ్చారు. బ్యారేజీల డిజైన్లలో మార్పులపై కమి షన్​ ప్రశ్నించగా.. సుందిళ్ల బ్యారే జీ రెండో బ్లాక్ ఏలో అదనపు ఆరు వెంట్లు డిజైన్స్​లో మొదట లేవని.. ఆ  తరువాత చేర్చారని చెప్పారు.