నిబంధనలు పాటిస్తే డ్యామేజీ అయ్యేదా: కాళేశ్వరం కమిషన్ విచారణలో ఆఫ్కాన్స్ ప్రతినిధులు

నిబంధనలు పాటిస్తే డ్యామేజీ అయ్యేదా: కాళేశ్వరం కమిషన్ విచారణలో ఆఫ్కాన్స్ ప్రతినిధులు
  • టెండర్లు వేసే ముందు సర్వే చేశారా
  • వందేండ్ల నాణ్యతతో నిర్మిస్తే కూలిందేం
  • ఆఫ్కాన్స్ పై కాళేశ్వరం కమిషన్ సీరియస్
  • ‘అన్నారం’ ఆలస్యం 
  • 2019లోనే డ్యామేజీ గుర్తించాం

హైదరాబాద్: విచారణలో భాగంగా కాళేశ్వరం కమిషన్ ఇవాళ  ఆఫ్కాన్స్ ప్రతినిధులను ప్రశ్నించింది. ఈ సంస్థ అన్నారం బ్యారేజీని  నిర్మించింది. నిర్మాణంలో ఆలస్యం ఎందుకైందన్న కమిషన్ ప్రశ్నకు ప్రభుత్వం లొకేషన్లు మార్చడం వల్లే జాప్యమైందని ప్రతినిధులు బదులిచ్చారు.  టెండర్లు - కన్స్ట్రక్షన్ కు ముందు, తర్వాత కనీస నిబంధనలు పాటించలేదని కమిషన్ తెలిపింది. నిబంధనలు పాటించి ఉంటే డ్యామేజీ అయ్యేది కాదని పేర్కొంది.

టెండర్లు వేసే మందు సర్వేలు చేశారా..? అన్న ప్రశ్నకు.. ఈపీసీ కాంట్రాక్ట్ పద్ధతి అయితే సర్వేలు చేస్తారని, ఐటమ్ రేట్ కాంట్రాక్ట్ కాబట్టి ఎలాంటి సర్వేలు చేయలేదని తెలిపారు. ప్రాజెక్టును వందేండ్ల నాణ్యతతో నిర్మించామని చెప్పారు.  మొదటి రెండు వరదలకు ప్రాజెక్టులో ఎలాంటి సమస్యలు రాలేదని, 2019 నవంబర్ వరదల్లో సమస్యలు గుర్తించామని సంస్థ ప్రతినిధులు చెప్పారు.