ముగ్గురి అఫిడవిట్లు మక్కికి మక్కి.. నవయుగ ప్రతినిధులపై కమిషన్ అసంతృప్తి

ముగ్గురి అఫిడవిట్లు మక్కికి మక్కి.. నవయుగ ప్రతినిధులపై కమిషన్ అసంతృప్తి

= సేమ్ ఉన్నాయన్న కాళేశ్వరం కమిషన్
= నవయుగ ప్రతినిధులపై అసంతృప్తి
= సుందిళ్ల డ్యామేజీపైనే ప్రశ్నలు

హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ విచారణ శరవేగంగా సాగుతోంది. ఇవాళ నవయుగ డైరెక్టర్ రమేశ్, సంస్థ ప్రాజెక్ట్ ఇన్‌చార్జులు ఈశ్వరరావు, మాధవ్ విచారణకు హాజరయ్యారు. సుందిళ్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని ఈ సంస్థ చేపట్టింది. నవయుగ డైరెక్టర్ రమేశ్ అఫిడవిట్ పరిశీలించిన కమిషన్ కాపీ పేస్ట్ చేశారని, ముగ్గురివి సేమ్ ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. బ్యారేజీ డ్యామేజీ ఎలా జరిగిందని, ప్రశ్నించగా 2022లో వచ్చిన వరదలతోనే జరిగినట్టు నవయుగ డైరెక్టర్ రమేశ్ సమాధానం ఇచ్చారు. సీసీ బ్లాక్స్ కింద సీపేజీ ఏర్పడి బ్లాకులు కొట్టుకు పోయాయని చెప్పారు. దాని వల్లే వరద ప్రవాహం ఎక్కువగా రికార్డయ్యిందని అన్నారు.  

ALSO READ | కాకతీయ యూనివర్శిటీల విద్యార్థుల ఆందోళన.. పెట్రోల్ బాటిల్‎తో హల్చల్

డ్యామేజ్ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకున్నారని కమిషన్ ప్రశ్నించింది. గ్రౌంటింగ్ చేశామని, సీసీ బ్లాకులను పునరుద్ధరించామని రమేశ్  సమాధానం ఇచ్చారు. డిజైన్ ఆధారంగా.. డ్యామేజీ జరిగిన తర్వాత మరమ్మతులు చేశామని వెల్లడించారు. పనులు పూర్తి చేసినా బిల్లులు ఇంకా ఇవ్వలేదని వాపోయారు. పనులు పూర్తయినట్టు ప్రభుత్వానికి సర్టిఫికేట్ ఇచ్చినప్పటికీ డ్యామేజ్ జరగడంతో బిల్లులు ఆపారని రమేశ్ కమిషన్‎కు తెలిపారు. అగ్రిమెంట్ 2016లో జరిగిందని, సప్లిమెంటరీ అగ్రిమెంట్లు జరగలేదని నవయుగ కంపెనీ ప్రతినిధులు కమిషన్‎కు తెలిపారు.