కాళేశ్వరం విచారణ: బ్యాంకు గ్యారెంటీ రూ.1600 కోట్లు.. !

కాళేశ్వరం విచారణ: బ్యాంకు గ్యారెంటీ రూ.1600 కోట్లు.. !

హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ ఇవాళ నిర్వహించిన ఓపెన్ కోర్టు విచారణలో అనేక విషయాలు వెల్లడయ్యాయి. ఇవాళ జరిగిన విచారణకు ఐదుగురు ఇంజినీర్లు హాజరయ్యారు. మేడిగడ్డ బ్యారేజీ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ తిరుపతి రావు ఉన్నతాధికారులకు తెలియకుండానే ఏజెన్సీలకు రూ.1600 కోట్లకు బ్యాంకు గ్యారెంటీలు ఇచ్చారని విచారణకు హాజరైన ఇంజినీర్లు తెలిపారు. డిజైన్లు, డ్రాయింగ్‎లు ఎవరు తయారు చేశారని పీసీ ఘోష్ ప్రశ్నించగా.. వ్యాప్కోస్ సంస్థ తయారు చేసిందన్నారు. వాటిని సీడీఓ సీఈ అనుమతితో అమలు చేసినట్లు వివరించారు. 

ALSO READ | నిర్లక్ష్యం.. సహించం.. సాగర్ ఎడమ కాల్వ మరమ్మతులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఈఎన్సీ కార్యాలయంలో జరిగిన సమావేశం మినిట్స్ అనుసరించకుండానే వీటిని విడుదల చేసినట్లు వారు వివరించారు. అయితే బ్యారేజీల డ్యామేజ్‎కు అనుకున్నదానికంటే ఎక్కువ వరద రావడం వల్లే సీసీ బ్లాక్ దెబ్బతిన్నట్లు వివరించారు. 2022 జులైలో వచ్చిన భారీ వరదల వల్ల సీసీ బ్లాక్‎లు పాడైనట్లు తెలిపారు. ఈ డ్యామేజీ జరిగిన వెంటనే ఏజెన్సీలకు లేఖలు రాశామని కమిషన్‎కు వివరించారు. నిర్మాణానికి ముందు సైట్లలో ఎన్ఐటీ వరంగల్ ఆధ్వర్యంలో పరీక్షలు జరిగినట్లు ఇంజినీర్లు వివరించారు.