- గడువుకు ముందే బ్యాంక్ గ్యారంటీలు రిలీజ్ చేసిన గత బీఆర్ఎస్ సర్కార్
- కాళేశ్వరం కమిషన్ ముందు డిప్యూటీ సీఈ అజ్మల్ ఖాన్ వాంగ్మూలం
- 2021 జనవరిలో సర్క్యులర్ జారీ చేసిన ఈఈ తిరుపతి రావు
- ఎల్ అండ్ టీ నుంచి అండర్‌టేకింగ్ తీసుకున్నారో? లేదో? కూడా ఈఎన్సీకి తెలియదని ఖాన్ వెల్లడి
- వరద ఉధృతికే సుందిళ్ల సీసీ బ్లాకులు దెబ్బతిన్నయ్: చెన్నూర్ ఈఈ
- భారీ వరదల వల్లే మేడిగడ్డ సీసీ బ్లాకులు కొట్టుకుపోయినయ్: రిటైర్డ్ ఎస్ఈ కరుణాకర్
హైదరాబాద్, వెలుగు:మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ సంస్థ ఎల్అండ్టీకి అనుకూలంగా గత బీఆర్ఎస్ సర్కార్ పలు నిర్ణయాలు తీసుకున్నట్టు కాళేశ్వరం కమిషన్ విచారణలో బయటపడుతున్నది. కరోనా సాకుతో ఎల్అండ్టీకి రూ.1,597.12 కోట్ల మేర బ్యాంక్ గ్యారంటీలను గడువుకు ముందే రిలీజ్ చేయించారని కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ ఎదుట డిప్యూటీ సీఈ మహ్మద్అజ్మల్ఖాన్ వెల్లడించారు.
దీనికి సంబంధించిన సర్క్యులర్‌ను 2021 జనవరి 23న మేడిగడ్డ ఈఈ తిరుపతిరావు జారీ చేశారని తెలిపారు. బ్యాంక్ గ్యారంటీలకు సంబంధించిన అంశం మీటింగ్మినిట్స్లోనూ రికార్డ్ చేయలేదని చెప్పారు. సదరు సంస్థ నుంచి అండర్ టేకింగ్ తీసుకున్నారో? లేదో? కూడా ఈఎన్సీ (జనరల్)కి తెలియదని పేర్కొన్నారు. బ్యాంక్ గ్యారంటీలకు సంబంధించిన అంశాలన్నీ ఫీల్డ్ లెవెల్లోనే జరిగిపోయాయని వెల్లడించారు.
మంగళవారం బీఆర్కే భవన్లో కాళేశ్వరం కమిషన్‌చైర్మన్ జస్టిస్ పినాకి చంద్ర ఘోష్.. ఐదుగురు అధికారులను విచారించారు. ఈ సందర్భంగా 2020 నవంబర్ 13న బ్యాంక్ గ్యారంటీలను విడుదల చేసేందుకు ఇరిగేషన్‌శాఖ నిర్వహించిన మీటింగ్‌లో ఒప్పుకున్నారా? అని కమిషన్ ప్రశ్నించగా.. లేదని అజ్మల్ ఖాన్ సమాధానమిచ్చారు.
ఇరిగేషన్ఆఫీసుకు విజిలెన్స్డిపార్ట్మెంట్వాళ్లు వచ్చినప్పుడు మేడిగడ్డ ఒరిజినల్రికార్డ్స్కావాలని అడిగారా? అని ప్రశ్నించగా.. 2024 జనవరి 8న విజిలెన్స్డిపార్ట్మెంట్అధికారులు వచ్చి రికార్డులు అడిగారని చెప్పారు.
బ్యారేజీలకు వ్యాప్కోస్ డిజైన్లు..
సుందిళ్ల సహా మూడు బ్యారేజీల డిజైన్లు, డ్రాయింగ్స్, శాంక్షన్ ఎస్టిమేట్స్ వ్యాప్కోస్ సంస్థే ఇచ్చిందని కాళేశ్వరం కమిషన్ ముందు చెన్నూర్ ఈఈ బండ విష్ణుప్రసాద్ తెలిపారు. ఫైనల్ డిజైన్స్, డ్రాయింగ్స్మాత్రం సీడీవో ఇచ్చిందని.. ఆ డిజైన్లనే తాము ఫాలో అయ్యామని చెప్పారు. నిర్మాణ సమయంలో ఎన్ఐటీ వరంగల్జియోటెక్నికల్ఇన్వెస్టిగేషన్స్ నిర్వహించిందని పేర్కొన్నారు.
అయితే సుందిళ్ల బ్యారేజీలో డ్యామేజ్జరగడానికి కారణాలేంటని కమిషన్ ప్రశ్నించగా.. వరద ప్రవాహ వేగ అంచనాలను తప్పుగా రికార్డ్ చేయడమేనని విష్ణుప్రసాద్ తెలిపారు. ‘‘టెస్టుల సమయంలో వరద ప్రవాహ వేగాన్ని సెకనుకు 4.25 మీటర్లుగానే లెక్కించాం. కానీ బ్యారేజీ దగ్గర సెకనుకు 12 నుంచి 14 మీటర్లుగా నమోదైంది. ఒకేసారి సడన్‌గా భారీ వరద ప్రవాహం రావడంతో సుందిళ్ల బ్యారేజీ ముందు సీసీ బ్లాక్స్దెబ్బతిన్నాయి.
బ్యారేజీలో సీపేజీ రావడంతో సీడబ్ల్యూపీఆర్ఎస్ (సెంట్రల్వాటర్ అండ్పవర్రీసెర్చ్ స్టేషన్) అధికారులకు 2019 డిసెంబర్ 16న లేఖ రాశాం. 2020 జనవరి 22న సీడబ్ల్యూపీఆర్ఎస్అధికారులు వచ్చి బ్యారేజీని పరిశీలించి వెళ్లారు” అని వివరించారు.
రిపేర్ల బాధ్యత నిర్మాణ సంస్థలదే..
2022 జులైలో భారీ వరదలు వచ్చాయని, ఆ వరదలకే మేడిగడ్డ బ్యారేజీ సీసీ బ్లాకులు కొట్టుకుపోయాయని కమిషన్ కు రిటైర్డ్ ఎస్ఈ కరుణాకర్ చెప్పారు. వాటిని రిపేర్ చేయాల్సిన బాధ్యత నిర్మాణ సంస్థలదేనని స్పష్టం చేశారు. బ్యారేజీల నిర్మాణం పూర్తయ్యాక ఐదేండ్ల పాటు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ బాధ్యత కాంట్రాక్ట్సంస్థదేనని చెప్పారు.
డిఫెక్ట్లయబిలిటీ పీరియడ్మాత్రం రెండేండ్లపాటే ఉంటుందని పేర్కొన్నారు. కాగా, రామగుండం డిప్యూటీ ఎస్ఈ ఎస్.సత్యనారాయణ, రిటైర్డ్ఎస్ఈ సత్తిరెడ్డిని కూడా కమిషన్ విచారించింది.