హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ రేపటి నుంచి ఓపెన్ కోర్టు నిర్వహించనుంది. ఈ సందర్భంగా పలువురు ఇంజనీర్లను, రిటైర్డు ఇంజనీర్లను, ఉన్నతాధికారులను ప్రశ్నించనుంది. ఈ నెలాఖరు వరకు ఇంజనీర్లు, బ్యూరోక్రాట్ల విచారణ పూర్తి చేయాలనే ఆలోచనలో కాళేశ్వరం కమిషన్ ఉందని తెలుస్తోంది. ఇప్పటికే విచారణ చేసిన ఇంజినీర్లలోనూ పలువురుని కమిషన్ మరోమారు ప్రశ్నించనుంది. ఈ నెల 29వరకు క్రాస్ ఎగ్జామినేషన్ కొనసాగనుంది. కమిషన్‌కు అఫిడవిట్ దాఖలు చేసిన బీఆర్ఎస్ నేత వీ ప్రకాష్‌ను ఈ వారంలోనే బహిరంగ విచారణకు పిలువనుంది. ఈ నెలాఖరులోగా ఎన్డీఎస్ఏ, విజిలెన్స్‌లు తమ ఫైనల్ రిపోర్టులను కమిషన్‌కు అందించనున్నాయి.
ALSO READ | ఎన్ఐసీకి ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలు
ఈ క్రమంలో ఎన్డీఎస్ఏ, విజిలెన్స్, కాగ్ అధికారులను కూడా కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ చేయనుంది. ఈసారి వర్క్ ఏజెన్సీ ప్రతినిధులు, అకౌంట్స్ ప్రతినిధులను సైతం కమిషన్ ముందుకు రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. చివరగా ప్రజా ప్రతినిధులను బహిరంగ విచారణకు పిలవాలని కాళేశ్వం కమిషన్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కమిషన్ చీఫ్‌జస్టిస్ పీసీ ఘోష్ ఇవాళ ఇరిగేషన్ అధికారులు, విజిటెన్స్ డీజీ కొత్తకోట శ్రీనివాస్ ఎడ్డితో సమావేశమయ్యారు. వీలైనంత త్వరగా ఫైనల్ రిపోర్టు ఇవ్వాలని విజిలెన్స్ డీజీకి కాళేశ్వరం కమిషన్ సూచించింది.