- టీఎస్ఈఆర్ఎల్,డ్యామ్ సేఫ్టీ అధికారులను విచారించనున్న కమిషన్
హైదరాబాద్, వెలుగు : కాళేశ్వరం జుడీషియల్ కమిషన్ ఎంక్వైరీ శుక్రవారం నుంచి మళ్లీ మొదలుకానుంది. ఇప్పటికే పలువురు ఇంజనీర్లను ఓపెన్ కోర్టులో విచారించిన కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్ర ఘోష్.. శుక్రవారం నుంచి అఫిడవిట్లు సమర్పించిన మరికొందరు అధికారులను విచారించనున్నారు. క్రాస్ ఎగ్జామినేషన్‌లో భాగంగా తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ లేబొరేటరీస్(టీఎస్ఈఆర్ఎల్)కు చెందిన సిబ్బందితోపాటు.. స్టేట్ డ్యామ్ సేఫ్టీ సీఈని కూడా విచారించనున్నట్టు తెలిసింది.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ సహా అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి ఇంజనీరింగ్ రీసెర్చ్ లేబొరేటరీస్ మోడల్ స్టడీస్ నిర్వహించింది. ఈ నేపథ్యంలోనే ఆ మోడల్ స్టడీస్‌కు సంబంధించిన అంశాలపై ఆ డిపార్ట్మెంట్ అధికారుల నుంచి వివరాలను జస్టిస్ ఘోష్ ఆరా తీయనున్నట్టు తెలిసింది. మోడల్ స్టడీస్‌లో తేలిన అంశాలు.. బ్యారేజీల సేఫ్టీపై డ్యామ్‌సేఫ్టీ అధికారుల రిపోర్ట్‌లను క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు. ఓపెన్ కోర్టును ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు.