కాళేశ్వరానికి మరమ్మతులు ప్రారంభం
హైదరాబాద్/కరీంనగర్: కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని వాడుకునే పరిస్థితి లేదని, ప్రాజెక్టు మరమ్మతులు ప్రారంభమయ్యాయని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. భారీ వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బరాజ్ లు దెబ్బతిన్న విషయం తెలిసిందే. మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడంతో మహారాష్ట్ర నుంచి రాకపోకలు బందయ్యాయి.
మరమ్మతులు నిర్వహించబోమన్న ఎల్ అండ్ టీ కంపెనీకి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అధికారుల వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. ఇదిలా ఉండగా ఎస్సారెస్పీ చీఫ్ ఇంజినీర్ శంకర్ ఇవాళ( డిసెంబర్23) లోయర్ మానేరు డ్యాం దిగువన ఉన్న సాగు భూములకు వచ్చేఏడాది జనవరి 1 నుంచి 31 వరకు నీటిని విడుదల చేస్తామని చెప్పారు. ప్రాజెక్టు చివరి ఆయకట్టు రైతులు ఆరుతడి పంటలు మాత్రమే వేసుకోవాలని సూచించారు. వారబందీ పద్ధతిలో 8 రోజులు నీటి విడుదల, మరో ఏడు రోజుల ఆపుదల ఉంటుందని చెప్పారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ వరకు నీళ్లిస్తామని ఆయన వెల్లడించారు.