ఆర్మూర్, వెలుగు : బీజేపీ జిల్లా అధికార ప్రతినిధిగా ఆర్మూర్ కు చెందిన కలిగోట గంగాధర్ నియమితులయ్యారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేశ్కులచారి శుక్రవారం గంగాధర్ కు నియామకపత్రం అందజేశారు. తన నియామకానికి కృషి చేసిన ఎంపీ ధర్మపురి అర్వింద్
ఆర్మూర్ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, పార్లమెంట్ ప్రభారి వెంకట్రమణిలకు గంగాధర్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోదీ హయాంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలకు వివరించి, నిజామాబాద్ సెగ్మెంట్లో పార్టీ విజయానికి కృషి చేస్తానన్నారు.