
హైదరాబాద్, వెలుగు: ఐదో ఎడిషన్ హైదరాబాద్ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ (హెచ్‌పీజీఎల్)లో కళింగ వారియర్స్, కాంటినెంటల్ వారియర్స్ జట్లు జాయింట్ విన్నర్స్‌గా నిలిచాయి. వియత్నాంలోని బీఆర్‌జీ కింగ్స్ ఐలాండ్ గోల్ఫ్ కోర్సులో శుక్రవారం ఇరు జట్ల మధ్య అంత్యత హోరాహోరీగా జరిగిన ఫైనల్ మ్యాచ్ 40–40తో టైగా ముగిసింది.
దాంతో ఇరు జట్లూ ట్రోఫీని పంచుకున్నాయి. ఫైనల్ సింగిల్స్ మ్యాచ్‌ల్లో కళింగ జట్టులో ఆదిత్య జైన్, రఘవేందర్ రావు, ఫహీమ్ ఖురేషి, ఆదిత్య బొమ్మరాజు తమ ప్రత్యర్థులపై గెలిచారు. కాంటినెంటల్ టీమ్‌లో జగన్మోహన్ రెడ్డి, నవీన్ కుమార్, శ్రీనాథ్, శ్వాన్ కట్టా విజయం సాధించారు.