కల్కి 2 టైటిల్ చేంజ్.!

కల్కి 2 టైటిల్ చేంజ్.!

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898పడి. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో రూపొందింన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. మూవీ స్టోరీ ఓ రేంజ్ లో ఉండటంతో ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక సినిమాలో అశ్వత్థామ క్యారెక్టర్ చేసిన అమితాబ్ బచ్చన్ సినిమాకే హైలెట్గా నిలిచాడు. తన పర్ఫామెన్స్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ మూవీలో భైరవగా, క్లైమాక్స్ కర్ణుడి పాత్రతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. అయితే కర్ణుడి గురించి తెలుసుకోవాలంటే కల్కి-2 చూడండని డైరెక్టర్ ఎండ్ కార్డ్ వేశాడు. ఇప్పుడు కల్కి 2 గురించి ఓ అప్డేట్ అందుతోంది. కల్కి-2 మూవీని కర్ణ3102బీసీ అనే పేరుతో మేకర్స్ తెరకెక్కించనున్నారట. మూవీలో స్టోరీ అంతా ప్రభాస్, అమితాబ్ చుట్టూనే తిరుగుతుందని సమాచారం.

 అయితే కల్కి స్టోరీ జరిగేది భవిష్యత్తులో. కానీ కర్ణుడు ఉన్నది చరిత్రలో.. అంటే కథ భవిష్యత్తు నుంచి చరిత్రలోకి వెళ్తుందట. అందులో అశ్వాత్థామ, కర్ణుడి మధ్య అనుబంధం, మహాభారత యుద్ధం తర్వాత జరిగిన కథను డైరెక్టర్ నాగ్ చూపించబోతున్నాడట. అలాగే కర్ణుడు, అర్జునుడు మధ్య యుద్ధాన్ని భారీ సన్నివేశాలతో తెరకెక్కించనున్నాడట. మహాభారత యుద్ధంలో కమల్ హాసన్ పాత్ర ఎంటో కూడా క్లారిటీ ఇవ్వనున్నాడట. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ మూవీ వచ్చే ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళ్లనుంది. షూటింగ్ పూర్తి చేసి 2028 నాటికి మూవీని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట.