ప్రభాస్ కల్కి కొత్త రికార్డులు ఇవే.. దేశంలో అదరగొడుతున్న వసూళ్లు

ప్రభాస్ కల్కి కొత్త రికార్డులు ఇవే.. దేశంలో అదరగొడుతున్న వసూళ్లు

ప్రభాస్ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి సినిమా.. రిలీజ్ కంటే ముందే రికార్డులు బద్దలు కొడుతుంది. టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ లో సినీ ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు అడ్వాన్ బుకింగ్ ద్వారా 13 లక్షల 50 వేల టికెట్లు అమ్ముడు అయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇండియాలో ఇదే రికార్డ్ గా చెబుతున్నారు. రికార్డుల డేటా ఓసారి చూద్దాం..

>>> కల్కి 2898 AD సినిమా 2024, జూన్ 27వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది.
>>> జూన్ 26వ తేదీ ఉదయం 11 గంటల వరకు.. ప్రపంచ వ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్ కింద 13 లక్షల 50 వేల టికెట్లు అమ్ముడయ్యాయి.
>>>  జూన్ 27వ తేదీ రిలీజ్ రోజున ఏకంగా 10 లక్షల టికెట్లు అమ్ముడు అయ్యాయి. ఇది కూడా ఓ రికార్డ్
>>> ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్ కింద అమ్ముడు అయిన 10 లక్షల టికెట్లతో.. 37 కోట్ల రూపాయలు వచ్చాయి.
>>> కల్కి 2989 ఏడీ తెలుగు వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్ కింద 31 కోట్ల రూపాయలు వసూలు అయ్యింది.
>>> 2D వెర్షన్ అడ్వాన్స్ టికెట్ల బుకింగ్ ద్వారా 17 కోట్ల 60 లక్షల రూపాయలు వసూలు అయ్యాయి.
>>> 3D వెర్షన్ అడ్వాన్స్ టికెట్ల బుకింగ్ ద్వారా 13 కోట్ల 80 లక్షలు వసూలు అయ్యాయి.
>>> I MAX 3D తెలుగు వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 10 లక్షల రూపాయలు వసూలు అయ్యాయి.
>>>  కల్కి 2898 ఏడీ హిందీ వెర్షన్ లో అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 4 కోట్ల రూపాయలు వసూలు అయ్యాయి.
>>>  తెలుగుతోపాటు హిందీ, తమిళ్, మళయాళం భాషల్లో విడుదల అవుతుంది ప్రభాస్ కల్కి మూవీ.

ఓవరాల్ గా జూన్ 26వ తేదీ ఉదయం 11 గంటల వరకు 13 లక్షల 50 వేల అడ్వాన్స్ టికెట్ల అమ్మకం ద్వారా.. ఏకంగా 38 కోట్ల రూపాయల వరకు వసూలు అయినట్లు సినీ ఇండస్ట్రీ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దేశంలోనే ఇది ఓ సరికొత్త రికార్డ్ గా చెబుతున్నారు డిస్ట్రిబ్యూటర్లు.