Kalki 2898 AD Bujji: మీట్ ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్ బుజ్జి..భారీ ఈవెంట్ ప్లాన్ చేసిన కల్కి మేకర్స్..ఎప్పుడంటే?

Kalki 2898 AD Bujji: మీట్ ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్ బుజ్జి..భారీ ఈవెంట్ ప్లాన్ చేసిన కల్కి మేకర్స్..ఎప్పుడంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas),మహానటి ఫేమ్ దర్శకుడు నాగ్ అశ్విన్(Nag AShwin)కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి 2898 ఏడీ(Kalki 2898 AD).దాదాపు రూ.600 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సౌత్, నార్త్ కు సంబందించిన స్టార్స్ నటించారు. వారిలో.. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్. దీపికా పదుకొనే, దిశా పటాని కీ రోల్స్  చేస్తున్నారు. అందుకే ఈ సినిమాపై రోజురోజుకి అంచనాలు పెరుగుతున్నాయి.

రీసెంట్గా ప్రభాస్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో డార్లింగ్స్..ఫైనల్‌గా ఒక ముఖ్యమైన వ్యక్తి మన జీవితంలోకి రాబోతున్నారు.వెయింట్ చేయండి అని ప్రభాస్ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆ ముఖ్యమైన వ్యక్తి ఎవరా అని ఫ్యాన్స్ అందరు ఎంతగానో ఎదురు చూసారు. దీంతో కాబోయే భార్యను పరిచయం చేస్తున్నాడా? అంటూ కూడా సోషల్ మీడియాలో రకరకాలుగా గుసగుసలు వినిపించాయి. ఇక అదెవరో తెలిసిపోయింది. 

లేటెస్ట్గా కల్కి నుంచి అదిరిపోయే అప్‌డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు.'Skratch EP4: Building A Superstar BUJJI' పేరుతో వీడియోను రిలీజ్ చేశారు.ఈ వీడియోలో, భైరవ పాత్రలో నటించిన ప్రభాస్,బుజ్జి అనే తన ఫ్యూచరిస్టిక్ కారును చూపించారు.అలాగే మేకర్స్ అందరు బుజ్జి గురించి మాట్లాడుతూ..ఆడియన్స్లో మరింతగా హై లెవల్ బజ్ క్రియేట్ చేశారు.

"మన బాడీని మన బ్రెయిన్ ఎలా కంట్రోల్ చేస్తుందో..బుజ్జిని కూడా ఓ బ్రెయినే కంట్రోల్ చేస్తుంది" అని ఈ వీడియోలో తెలిపారు.ఆ తర్వాత ఓ గ్యాడ్జెట్‌ మూవీ టీమ్తో మాట్లాడుతూ ఉంటుంది. అలాగే ఫన్నీగా తిట్లు తిడుతోంది.ఇక ఈ వీడియో ఎండింగ్ లో 'ప్రభాస్..నీ టైమ్ స్టార్ట్ అయింది బుజ్జి పదా అంటారు.ఆ తర్వాత కారుపై కవర్ తీస్తారు.కానీ బుజ్జి ఎలా ఉంటుందో మాత్రం వీడియోలో చూపించలేదు.బుజ్జి శరీరం మానవ శరీరంలాగానే మెదడుచే నియంత్రించబడుతుందని దర్శకుడు నాగ్ అశ్విన్ వివరించారు.కాగా బుజ్జి దర్శనం మే 22న పరిచయం చేస్తామంటూ మేకర్స్ మరో ట్విస్ట్ ఇచ్చారు.

ప్రస్తుతం ఈ బుజ్జి ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఇక ఈ వాహనం డైలాగ్స్కు ప్రముఖ నటి కీర్తి సురేష్ తన గాత్రాన్ని అందించారు.ఇటీవల కీర్తి సురేష్ ఈ డైలాగ్స్ కు డబ్బింగ్ పూర్తిచేశారు.

‘బుజ్జీ’ స్పెషల్ కారును పరిచయం చేసేందుకు మే 22వ తేదీన భారీ ఈవెంట్ నిర్వహించేందుకు కల్కి 2898 ఏడీ టీమ్ రెడీ అయిందని తెలుస్తోంది. హైదరాబాద్‍లోని రామోజీ ఫిల్మ్ సిటీలో మే 22న ఈ ఈవెంట్‍ను గ్రాండ్‍గా చేసేందుకు ఇప్పటికే ఏర్పాట్లను కూడా షురూ చేసిందని టాక్ బయటికి వచ్చింది. ఈ ఈవెంట్ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఇండియన్ మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ కథాంశంతో వస్తున్న ఈ సినిమా ఇక కల్కి సినిమా విషయానికి వస్తే..ఈ సినిమా మహాభారతంతో మొదలై..2898వ సంవత్సరం వరకు జరుగనుందని టాక్. ఇదే విషయాని దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రకటించారు. ఈ మధ్యనే కల్కి సినిమా నుండి విడుదలైన టీజర్ ఏ రేంజ్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదే రేంజ్ లో సినిమా కూడా ఉంటుందని సమాచారం. మరి భారీ అంచనాల మధ్య  జూన్ 27న  వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయనుందో చూడాలి.